Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెంట పడుతున్న కుర్ర హీరోయిన్స్..ఇది మామూలు క్రేజ్ కాదుగా!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్నా మొన్నటి వరకు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొని ఆ చిత్రాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతం లో […]

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్నా మొన్నటి వరకు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొని ఆ చిత్రాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అనే చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టేసింది.అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ కి అంత క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా తో పాటుగా త్వరలో ఆయన చేయబోతున్న #OG సినిమా మీద కూడా అభిమానుల్లో మామూలు అంచనాలు లేవు.ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెల 15 వ తారీఖు నుండి ముంబై లో ప్రారంభం కానుంది.
అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మేకర్స్ ఈ చిత్రం లో హీరోయిన్ గా టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తున్నట్టు అధికారికంగా ఒక ప్రకటించారు.నేటి నుండే ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టింది.మరో పక్క #OG సినిమా హీరోయిన్ కూడా ఖరారు అయిపోయింది, ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్టు సమాచారం.ఈమె ఈ నెల 15 వ తారీఖు నుండి ముంబై లో ప్రారంభం అవ్వబోతున్న #OG మొదటి షెడ్యూల్ లో పాల్గొనబోతుంది.
ఇలా వరుసగా కుర్ర హీరోయిన్స్ తో పవన్ కళ్యాణ్ రొమాన్స్ చెయ్యబోతుండడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా ఈ కుర్ర హీరోయిన్స్ తో మ్యాచ్ అయ్యే విధంగా మారిపోయాయి.ఆన్ స్క్రీన్ మీద ఈ పెయిర్ ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
