
MLC Elections Results- YCP
MLC Elections Results- YCP: సంక్షేమ పథకాలు.. వాలంటీర్ల వ్యవస్థ తమకు బలం, బలగం అంటూ చెప్పుకొచ్చిన అధికార పార్టీకి.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే అవి ఏమాత్రం అక్కరకు వచ్చినట్లు కనిపించడం లేదు. పైపెచ్చు ఈ రెండు అధికార పార్టీకి మైనస్గానే కనిపించాయి.
ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని చేసే ప్రయత్నాలు ఎన్నాళ్లు సాగవు. నిజాలు తెలిసిన తర్వాత ఏ ప్రజలు ఆగరు. ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజానాడికి అద్దం పట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పును పరిశీలిస్తే అర్థం అవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు ఎప్పుడు పెట్టిన సింగిల్ గా ఎదుర్కొన విజయం దక్కించుకుంటామని పదేపదే చెప్పిన వైసీపీ నాయకులకు ఈ ఫలితాలు చెంప దెబ్బ లాంటివి.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల కోట, ఉపాధ్యాయ వర్గాల కోట, పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోట మినహా మిగిలిన రెండు కోటాల ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. అయితే, ఆ రెండు కోటాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆయా వర్గాలకు మాత్రమే పరిమితం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఫలితాలు మాత్రం విస్తృతమైన ప్రజాభిప్రాయానికి అవకాశం ఉన్న ఫలితాలు. ఎందుకంటే డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ ఇందులో ఓటరే. ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఓటర్లుగా ఉన్నారు.
వివేచన.. ఆలోచనతో కూడిన ఓటు..
పట్టభద్రులంటే చదువుకున్న వారు. మీరు వేసే ఓటు ఒకంత వివేచన ఆలోచనతో ఉంటుందనేది పరిశీలకులు మాట. తాజా ఎన్నికల ఫలితాలను చూస్తే అదే విధంగా ఓటు వేశారన్నది అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? పాలన ఎలా ఉంది..? ఏ పార్టీ ప్రజలకు అండగా ఉంది..? అభివృద్ధి మాటేంటి..? వంటి అనేక విషయాల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు నిపుణులు. పథకాలు సంక్షేమంతోనే పొద్దున్న వైసీపీ ప్రభుత్వం.. ఎక్కడ గంపెడు మట్టి పోయలేదు.. పట్టుమని ఓ పరిశ్రమలు కూడా స్థాపించలేదు. ఇది పట్టభద్రులైన ఓటర్లను ఆలోచనకు గురి చేసింది. అప్పులు చేయడం, వాటిని ప్రజలకు పంచడం.. ఆ అప్పుల భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రజల అందరి పైన మోపడం వంటివే పాలన అని భావిస్తున్నట్టుగా వైసీపీ నేతలపై ఒకింత చదువుకున్న వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఉత్తరాంధ్ర తీర్పు మేలి మలుపు అని చెప్పవచ్చని అంటున్నారు.
సంపాదన మార్గాల అవసరం..
ప్రజలకు కావాల్సింది కూర్చోబెట్టి డబ్బులు పంచడం కాదని ఆ డబ్బులు సంపాదించుకునే మార్గాలను అవకాశాలను అంది ఇవ్వాలనే అభిప్రాయాన్ని యువత వ్యక్తం చేస్తుంది. ఆ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేశారు అన్న బావన సర్వత్ర వ్యక్తమవుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ రెండు చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అప్పులు చేస్తూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్లు తమదైన శైలిలో తీర్పు ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.

JAGAN
మార్పు వచ్చేనా..
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలోనైనా ప్రభుత్వ ప్రాంతాల ఆలోచన విధానం మారితే బాగుంటుందన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. అధికార పార్టీ తమకు బలంగా చెప్పుకుంటున్న వాలంటీర్లు, సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని నేపథ్యంలో అధికార పార్టీ పెద్దలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల విశ్లేషిస్తున్నారు. వై నాట్ 175 అంటూ బీరాలు పలికిన పార్టీ పెద్దలు తాజా ఫలితాలను విశ్లేషించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేయాలని ఆ పార్టీ నాయకులు సూచిస్తున్నారు.