Mithun Reddy vs Ram Mohan Naidu: రేయ్ కూర్చోరా.. రామ్మోహన్ నాయుడు పై రెచ్చిపోయిన మిధున్ రెడ్డి
Mithun Reddy vs Ram Mohan Naidu: జాతీయస్థాయిలో మరోసారి ఏపీ నేతల అనుచిత ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ వేదిక గా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎంపీలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇందుకు చంద్రబాబు అరెస్టు అంశం కారణమైంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై వైసిపి, టిడిపి ఎంపీల మధ్య పెద్ద గలాటా చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఒరేయ్ తురేయ్ అంటూ వైసీపీ సభ్యులు కామెంట్స్ చేయడంపై సీనియర్ ఎంపీలు […]

Mithun Reddy vs Ram Mohan Naidu: జాతీయస్థాయిలో మరోసారి ఏపీ నేతల అనుచిత ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ వేదిక గా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎంపీలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇందుకు చంద్రబాబు అరెస్టు అంశం కారణమైంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై వైసిపి, టిడిపి ఎంపీల మధ్య పెద్ద గలాటా చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఒరేయ్ తురేయ్ అంటూ వైసీపీ సభ్యులు కామెంట్స్ చేయడంపై సీనియర్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తొలుత చంద్రబాబు అరెస్టుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. రాజకీయ కక్షపూరితంగానే చంద్రబాబు అరెస్టు చేశారని.. కనీస నిబంధనలు పాటించలేదని.. నిరాధారమైన ఆరోపణలతో సెక్షన్లను నమోదు చేశారని.. తక్షణం కేంద్రం కలుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ఎంపీ భరత్ అడుగడుగునా అడ్డు తగిలారు. అయినా సరే జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగిందని.. ఆయన తప్పు చేసినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయని.. ఇందులో రాజకీయ ప్రమేయం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. దీనిపై రామ్మోహన్ నాయుడు ఖండించేందుకు ప్రయత్నించగా మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. ” కూర్చో రా బాబు కూర్చోరా ” అంటూ హేలన గా మాట్లాడారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు హస్తము ఉందని మిధున్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానిని రామ్మోహన్ నాయుడు ఖండించారు. దీంతో ఆగ్రహానికి గురైన మిధున్ రెడ్డి సహచర ఎంపీ అన్న కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా రామ్మోహన్ నాయుడుని ఏక వచనంతో సంబోధించారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు పై మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను పలువురు ఎంపీలు కూడా తప్పుపట్టారు.
అయితే ఏపీ ఎంపీలు కీచులాటకు దిగడం జాతీయస్థాయిలో ఏపీ పరువు పోయినట్టు అయింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రజా సమస్యలపై స్పందించడంలో ముందుంటారు. మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. అటువంటి నేతపై ఎంపీ మిధున్ రెడ్డి విమర్శలకు దిగడం పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిధున్ రెడ్డి తీరుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ సమస్యలపై స్పందించడంలో ముందంజలో ఉండే రామ్మోహన్ నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎక్కువమంది ఖండిస్తున్నారు. మరికొందరైతే ఏపీలో ఏ సమస్యలు లేనట్టు.. చంద్రబాబు అరెస్టుపై ఈ లొల్లి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
