YCP Minister: ఆంధ్రప్రదేశ్ లో విమర్శల దారి మళ్లుతోంది. బూతు పురాణాల నుంచి అశ్లీలం వరకు వెళ్లింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మద్య మాటల యుద్ధం తారా స్తాయికి చేరింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబుపై ఎన్నో రకాలుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి అయ్యాక కూడా అవే మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడుమంత్రి అంబటి రాంబాబుపై ఓ ఆడియో కూడా పెట్టడం సంచలనం సృష్టిస్తోంది.

YCP Minister
మంత్రి రాంబాబుకు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ యాంకర్ మీ ఇంటర్వ్యూ కావాలని సందేశం పంపగా ఇస్తే నాకేమిస్తావని అంబటి బదులిచ్చారు. దీంతో దీనికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఆందోళన మొదలైంది. అంబటి దుర్బుద్ధి అందరికి తెలిసిందని అయ్యన్నపాత్రులు ఆరోపిస్తున్నారు. ఆడదైతే ఫర్వాలేదు ఏదీ అక్కరలేదనే అంబటి చెబు కోణాన్ని బయటకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు సీఎంకు చేరినట్లు చెబుతున్నారు.
Also Read: Illegal Affairs: ఏపీలో ఒక పురుషుడికి నాలుగు ఎఫైర్లు.. తెలంగాణలో ఎంతంటే?
ఇక అంబటి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనేది వారే నిర్ణయించుకోవాలని అయ్యన్న పాత్రులు పేర్కొంటున్నారు. ట్విటర్ లో మాట్లాడిన మాటలు ఎవరివని ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆడియోతో అంబటి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంబటిపై ఎన్నో ఆరోపణలు ఉండగా ఇప్పుడు కొత్తగా ఇది తెరమీదికి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంబటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.

YCP Minister
దీనిపై అంబటి కూడా ఘాటుగానే స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఎందరో ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేశారు. పనికట్టుకుని తనపై ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఇలాంటివి ఎన్నో వచ్చినా తనకేం కాదని ధీమాలో ఉన్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాంబాబు కాదని ఆయన పేరు కాంబాబు అని పెడితే బాగుంటుందని అయ్యన్నపాత్రుడు బదులివ్వడం సంచలనం కలుగుతోంది.
గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎన్నో వచ్చినా చర్యలు మాత్రం తీసుకోలేదు. మహిళలతో అసభ్యంగా మాట్లాడటం ఆయనకు కొత్తేమీ కాదు. అంబటి మాత్రం తన గొంతును మార్ఫింగ్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంబటి పేర్కొనడం గమనార్హం.
Also Read:Russia-China Presidents: ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన అధ్యక్షులు. కానీ వాళ్ళు బతకటం కష్టమే!
Recommended Videos: