YCP Corporator Husband: మరీ అంత చీప్ గానా? జేబు దొంగతనం చేస్తూ దొరికిన వైసిపి కార్పొరేటర్ భర్త
రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకునే క్రమంలో దారి పొడవునా అభిమానులు చంద్రబాబుకు బ్రహ్మరథం పెట్టారు. అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు చంద్రబాబు కోసం ఎదురుచూడడం కనిపించింది.

YCP Corporator Husband: బెయిల్ పై విడుదలైన చంద్రబాబు భారీ కాన్వాయ్ నడుమ ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ఇంటికి చేరేసరికి బుధవారం తెల్లవారుజాము ఐదు గంటలు అయింది. దాదాపు 14 గంటల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. దారి పొడవునా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో జేబుదొంగలు తమ చేతికి పని చెప్పారు.
రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకునే క్రమంలో దారి పొడవునా అభిమానులు చంద్రబాబుకు బ్రహ్మరథం పెట్టారు. అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు చంద్రబాబు కోసం ఎదురుచూడడం కనిపించింది. ఈ తరుణంలో తెల్లవారుజామున విజయవాడ నగరానికి చంద్రబాబు ర్యాలీగా చేరుకున్నారు. అయితే అక్కడ జేబు దొంగలు రెచ్చిపోయారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో టిడిపి కార్యకర్తల జేబులో 20వేల నగదును కొట్టేందుకు ప్రయత్నించిన వైసిపి కార్పొరేటర్ భర్త గోదావరి బాబు టిడిపి శ్రేణులకు చిక్కారు. ఆయనకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 47 వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గా గోదావరి గంగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త గోదావరి బాబుకు నేర సంస్కృతి ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గోదావరి బాబుపై కేడీ షీట్ ఉంది. జేబు దొంగతనాలు, రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లో చోరీలో గోదావరి బాబు సిద్ధహస్తుడు. గత ఎన్నికల్లో ఆయన భార్య వైసీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఒక ప్రజా ప్రతినిధి భర్త అయ్యుండి కూడా గోదావరి బాబు పాతవృత్తిని వదులుకోలేదు. అది కూడా చంద్రబాబు బెయిల్ ర్యాలీలో దొంగతనం చేస్తూ దొరికిపోవడం.. టిడిపి శ్రేణుల చేతిలో దేహశుద్ధికి గురి కావడం.. వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు.
