Janasena : పీఏసీ సభ్యులు జనసేన నాయకులు కొణిదెల నాగబాబు గారి అనంతపురం జిల్లా పర్యటన విజయవంతమైందని అక్కసుతో అనంతపురం నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి విమర్శలు చేయడం దారుణమని.. దీన్ని హేయమైన చర్యగా ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి తెలిపారు. అనంతపురం నగరం మేయర్ వసీం నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటున్నారని.. యాడాడ పరిగెత్తందో…. ఎంత స్పీడ్ తో పరిగెత్తుతాందో కొద్దిగా చూపించగలవా? అంటూ సవాల్ చేశారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి జనసేన పార్టీ జెండా అజెండా నీకు తెలదేమో గానీ? రాష్ట్ర ప్రజలకు అనంతపురం పట్టణ ప్రజలకు స్పష్టంగా తెలుసు అంటూ హితవు పలికారు.
నగరపాలక సంస్థకు మీరు మేయర్, డిప్యూటీ మేయర్ అయిన తర్వాత ఏరోజైనా అనంతపట్టం అభివృద్ధి గురించి సమీక్ష జరిపి, ప్రెస్ మీట్ పెట్టారా? అంటూ జయరాం రెడ్డి నిలదీశారు. నేడు స్పష్టంగా ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పగలరా? అంటూ సూటిగా ప్రశ్నించారు..
అనంతపురం నగరంలో స్థానిక సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని.. మరీ ముఖ్యంగా తేలికపాటి వర్షాలకే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇండ్లల్లోకి నీరు వచ్చి మొన్ననే సోమనాథ్ నగర్, రజక కాలనీ ఈ ప్రాంతమంతా ముంపుకు గురై ప్రజలు ఇక్కట్లు పడ్డారు, ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచారా? అంటూ జయరాం రెడ్డి నిలదీశారు.
‘కేంద్ర ప్రభుత్వ నిధులతో క్లాక్ టవర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి, అందులో మరియు ముఖ్యంగా నగర కార్పొరేషన్ రోడ్డు వైండింగ్లో తొలగించే భవనాలకి కంపెన్సేషన్ పే చేయాలి… నగరపాలక సంస్థ కాంపెన్సేషన్ ఇవ్వలేకపోవడం వల్ల కొంతమంది హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు వారికి కాంపెన్సేషన్ పే చేసి సర్వీస్ రోడ్లు సక్రమంగా నిర్మించ గలరా?’ అంటూ జయరాం రెడ్డి నిలదీశారు.
అనంతపురం పట్టణ స్థానిక సమస్యల గురించి మీరు చర్చకు వస్తామంటే మేము సిద్ధంగా ఉన్నాం మీరు రాగలరా? అంటూ జయరాం రెడ్డి సవాల్ చేశారు. మరొక మారు జనసేన పార్టీ గురించి కానీ, జనసేన నాయకులు గురించి గానీ అవాక్కులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మరీ ముఖ్యంగా నాగబాబు పర్యటన విజయవంతం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపురం పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా జయరాం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.