Yash: ప్రభాస్ చేసిన తప్పు చేయకూడదు అనుకుంటున్న యష్?

ఒకసారి పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించడం కష్టమే. కష్టపడి ఆ పేరు సంపాదించిన నిలబెట్టుకోవడం మరింత కష్టం. లేదంటే ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకు పడిపోవాల్సిందే. ఈ విషయంలో ప్రభాస్ విఫలం అయ్యారనే చెప్పాలి.

  • Written By: Suresh
  • Published On:
Yash: ప్రభాస్ చేసిన తప్పు చేయకూడదు అనుకుంటున్న యష్?

Yash: టాలీవుడ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ముందుగా బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా చూపించారు ఈ డైరెక్టర్. అయితే ప్రభాస్ నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఇదే బాటలో యష్ కూడా నడిచారు. కనీసం రూ. 50 కోట్ల మార్కెట్ లేని ఈ కన్నడ హీరో కేజీఎఫ్ సినిమాతో రూ. 1000 కోట్ల మార్కెట్ ను సృష్టించాడు. ఈ సినిమా కూడా రెండు పార్ట్ లుగా వచ్చి బాహుబలికి పోటీగా ఆర్ఆర్ఆర్ కు ధీటుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

ఒకసారి పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించడం కష్టమే. కష్టపడి ఆ పేరు సంపాదించిన నిలబెట్టుకోవడం మరింత కష్టం. లేదంటే ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకు పడిపోవాల్సిందే. ఈ విషయంలో ప్రభాస్ విఫలం అయ్యారనే చెప్పాలి. బాహుబలి సినిమా రేంజ్ ను ఇప్పటికీ దాటలేకపోయాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ దారిలో నడవద్దు అనుకుంటున్నారట యష్. అందుకే కేజీఎఫ్ పార్ట్ 2 విడుదలై ఏడాది గడుస్తున్నా కూడా మరో సినిమాను ప్రకటించలేదు.

వచ్చిన ఆఫర్ ను ఒప్పుకోవడం కంటే ఆచితూచి అడుగువేయడం మిన్నా అని ఆలోచిస్తున్నారట యష్. సంవత్సరం నుంచి సినిమాలు ప్రకటించని యష్ ఒక తమిళ డైరెక్టర్ చెప్పిన మాఫియా కథ నచ్చి దానికి సైన్ చేసే ఆలోచనలో ఉన్నాడట ఈ హీరో. అంతేకాదు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి రాముడు సీత పాత్రలతో రాబోతున్న రామాయణంలో కూడా యష్ నటించబోతున్నారు అని టాక్. మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడిన తర్వాత ఎలాంటి సినిమాలకు సైన్ చేయాలి అనే విషయంలో ప్లాన్ గా ఆలోచించి.. కలెక్షన్లు కుమ్మరించే సినిమాలను మాత్రమే ఒప్పుకోవడానికి సిద్దమయ్యారు యష్. మరి ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వబోతున్నాయో చూడాలి.

మొత్తానికి యశ్ ఏది పడితే అది తీసే అవకాశాలు అయితే కనిపించడం లేదు.తీసే సినిమా ఖచ్చితంగా అతని మార్కెట్ ను కన్నడ సినిమా స్టాండర్డ్ ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉండాలని కాస్త సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది పాటించాల్సిందిగా యశ్ కోరుకుంటున్నాడు సోషల్ మీడియాలో తగినంత టైం కూడా తన అభిమానుల కోసం తీసుకుంటున్నాడు.ఈసారి 1000 కోట్ల మార్కెట్ దాటి రేంజ్ సినిమా తీస్తాడో మరికొన్ని రోజులు ఆగితే గాని తెలిసే అవకాశం కనిపించడం లేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు