Writer Padmabhushan Collection: విలక్షణమైన నటనతో ప్రేక్షకులలో అశేష ఆదరణ దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రముఖ నటుడు ‘సుహాస్’ హీరో గా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే సుహాస్ హీరో గా ‘కలర్ ఫోటో’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కింది.

Writer Padmabhushan Collection
ఇప్పుడు హీరో గా మరోసారి అదే రేంజ్ సక్సెస్ అందుకోవడం విశేషం..ఇప్పటికే ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అయ్యింది..ఈ నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది..3 కోట్ల 80 లక్షల రూపాయిల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా నాలుగు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ఈ చిత్రం డైలీ కలెక్షన్స్ రిపోర్ట్స్ ని ఒకసారి పరిశీలిస్తే వసూళ్ల గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ పోవడాన్ని మనం గమనించొచ్చు.మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.కానీ రెండవ రోజు ఏకంగా కోటి 25 లక్షల రూపాయిల వసూళ్లు రాగా, మూడవ రోజు దాదాపుగా కోటి 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..అలా మూడు రోజులకు కలిపి మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ రాగ , షేర్ కోటి 75 లక్షలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు..ఇదంతా కేవలం తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు మాత్రమే..కానీ ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా మంచి రన్ ఉంది..అక్కడ ఈ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే రెండు లక్షల 30 వేల డాలర్లు వచ్చాయి.

Writer Padmabhushan Collection
అవి ఇండియన్ కరెన్సీ లోకి మార్చి తెలుగు స్టేట్ కలెక్షన్స్ కి యాడ్ చేస్తే 5 కోట్ల 21 లక్షల రూపాయిల గ్రాస్ మరియు రెండు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇక నాల్గవ రోజు కూడా ఈ సినిమాకి 30 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని, మొత్తం మీద 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ గా ఈ సినిమా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.