WPL : హార్మన్ ప్రీత్ అదరగొట్టింది: గుజరాత్ 64 పరుగులకే ప్యాకప్ అయ్యింది
WPL : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లో ముంబై జట్టు భారీ విజయాన్ని అందుకుంది. టోర్నీలో అదిరిపోయే ఆరంభాన్ని ప్రారంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తమ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో కని విని ఎరగని స్థాయి ఆరంభాన్ని అందించారు..కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కౌర్ (30 బంతుల్లో 14 ఫోర్లతో 65 పరుగులు) తొలి మ్యాచ్ లోనే పరుగుల సునామీ సృష్టించింది. లీగ్ మ్యాచ్లో తొలి […]

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లో ముంబై జట్టు భారీ విజయాన్ని అందుకుంది. టోర్నీలో అదిరిపోయే ఆరంభాన్ని ప్రారంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తమ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో కని విని ఎరగని స్థాయి ఆరంభాన్ని అందించారు..కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కౌర్ (30 బంతుల్లో 14 ఫోర్లతో 65 పరుగులు) తొలి మ్యాచ్ లోనే పరుగుల సునామీ సృష్టించింది. లీగ్ మ్యాచ్లో తొలి ఆఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది. అంతే కాదు గుజరాత్ జట్టును 64 పరుగులకు ఆల్ అవుట్ చేసి 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది
7 వికెట్ల నష్టానికి 207 పరుగులు
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ తో పాటు అమెలియా కేర్ (24 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ తో) 45 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 3 ఫోర్లు,4 సిక్స్ లతో 47 పరగులు) సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఇక గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు, వారే హమ్, తనూజ ఒక వికెట్ తీశారు.
మొదట్లోనే గట్టి ఎదురు దెబ్బ
టాస్ ఓడిన ముంబై జట్టుకు మొదట్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది..తనూజ వేసిన మూడో ఓవర్లో ఓపెన్ యస్తిక భాటియా (1) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. క్రీజు లో నాట్ సీవర్ తో కలిసి మాథ్యూస్ ఇన్నింగ్స్ ముందుకు నడిపింది. ముఖ్యంగా జ్యూసీ వేసిన రెండో ఓవర్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి జోరు కనబరిచింది. మౌనిక పటేల్ వేసిన ఐదో ఓవర్ లో నాట్ సివర్ వరుసగా 2 ఫోర్లు కొట్టింది. దీంతో స్కోర్ బోర్డు వివేకంగా ముందుకు కదిలింది. కన్వర్ వేసిన ఆరో ఓవర్లో మాథ్యూస్ మరో వరస బౌండరీలు బాదింది. వీరిద్దరి జోరుకు ముంబై పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.
మాథ్యూస్ మరింత రెచ్చిపోయింది
ఈ పవర్ ప్లే ముగిసిన అనంతరం మాథ్యూస్ మరింత రెచ్చిపోయింది. సదర్లాండ్ వేసిన ఎనిమిదవ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాధింది. వారెమ్ వేసిన మరుసటి ఓవర్లో మ్యాథ్యూస్ మరో సిక్స్ కొట్టింది. అదే ఓవర్ లో 5వ బంతికి సీవర్(23) క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. గార్డనర్ వేసిన పదో ఓవర్లో బౌండరీ కొట్టి ఆఫ్ సెంచరీకి చేరువైన మాథ్యూస్ అదే ఓవర్ చివరి బంతికి కట్షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బోల్డ్ అయింది. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన అమేలియా కేర్ తో కలిసి కౌర్ విధ్వంసం సృష్టించింది. రాణా వేసిన 11 ఓవర్లో వరుసగా రెండుసార్లు కొట్టింది. వార్ హమ్ వేసిన 12వ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. కేర్ కూడా ఒక బౌండరీ సాధించడంతో ఆ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి.
21 పరుగులు వచ్చాయి
సదర్ లాండ్ వేసిన ఓవర్లో కౌర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టింది. రాణా బౌలింగ్లో కేర్ మరో రెండు ఫోటోలు కొట్టడంతో ముంబై స్కోర్ బోర్డు సునామీలా కదిలింది. మోనికా వేసిన ఐదో ఓవర్ లో కేర్ ఒకటి, హర్మన్ ప్రీత్ వరుసగా నాలుగు ఫోర్లు కొట్టింది. దీంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. గార్డ్ నర్ వేసిన మరుసటి ఓవర్లో రెండో బంతిని ఫోర్ కొట్టిన హర్మన్ డబ్ల్యూ పి ఎల్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేస్తుంది. 23 బంతుల్లో ఆమె ఆఫ్ సెంచరీ మార్కు సాధించింది. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి ఆమె అదే జోరుని కొనసాగించింది. ఆ తర్వాత రాణా వేసిన 17 ఓవర్ చివరి బంతికి కౌర్ షార్ట్ థర్డ్ ఫీల్డర్ కు చిక్కి క్యాచ్ అవుట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వస్త్రాకర్, కేర్ ధాటిగా ఆడి 208 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు.
తేలి పోయింది
అనంతరం లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టు 15.1 ఓవర్లలో 64 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గుజరాత్ బ్యాటర్లలో 23 పరుగులు చేసిన హేమలత టాప్ స్కోరర్ గా నిలిచింది…మిగతా బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మేఘన(2), మూనీ(0), డియోల్(0), గార్డ్ నర్(0), సదర్ లాండ్(6), వారే హమ్ (8), రాణా(1),తనూజ(0), జోషి(6), మోనికా(10) ఇలా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే వెళ్లడంతో గుజరాత్ 143 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ముంబై బౌలర్లలో సైకా 4, అమీలియా, బ్రంట్ చేరో రెండు, వాంగ్ 1 వికెట్ తీశారు.
