Rajamouli Bahubali: బాహుబలి 2 ఆడకపోతే రాజమౌళి రోడ్డున పడేవాడా? ఎంత పెద్ద రిస్క్ చేశారో తెలుసా?
ఈ సినిమా పెట్టుబడి విషయంలో జరిగిన లావాదేవీలు తాజాగా రానా దగ్గుబాటి బయటపెట్టారు. బాహుబలి చిత్రం కోసం ఏకంగా రూ. 180 కోట్లు అప్పు చేశారట.

Rajamouli Bahubali: ధైర్యే సాహసే లక్ష్మి అనే ఒక సామెత ఉంది. మనోబలంతో ముందుకు పోవాలి విజయం సాధించాలని దాని అర్థం. రాజమౌళి బాహుబలి సినిమాతో చేసిన ప్రయోగం కూడా అలాంటిదే. తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్లు కూడా లేని సమయంలో ఆయన బాహుబలి సిరీస్ కి నాలుగైదు వందల కోట్లు కేటాయించారు. సినిమాలో కంటెంట్ ఉంటే అన్ని భాషల ఆడియన్స్ చూస్తారు. పెట్టుబడి రాబట్టడం ఈజీ అని ఆయన నమ్మారు. ఫస్ట్ ఒక భాగంగా బాహుబలి మొదటిపెట్టి దాన్ని రెండు భాగాలు చేశారు.
ఈ సినిమా పెట్టుబడి విషయంలో జరిగిన లావాదేవీలు తాజాగా రానా దగ్గుబాటి బయటపెట్టారు. బాహుబలి చిత్రం కోసం ఏకంగా రూ. 180 కోట్లు అప్పు చేశారట. అది కూడా 24% వడ్డీకి. నాలుగున్నరేళ్ళ పాటు అంత మొత్తానికి రెండు రూపాయల వడ్డీ కట్టారట. బహుబలి వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఇందులో నిర్మాతకు మిగిలింది ఏమీ లేదు. అప్పు ఇంకా మిగిలే ఉందట. బాహుబలి 1 బడ్జెట్ లో కొంత భాగం బాహుబలి 2 కూడా షూట్ చేశారట.
ఒకవేళ బాహుబలి 2 ఆడకపోతే ఆ నష్టం ఊహించనిది అని రానా అన్నారు. నిర్మాత దారుణంగా నష్టపోయేవారని రానా చెప్పుకొచ్చారు. ఆ స్థాయిలో బాహుబలి సిరీస్ కోసం రాజమౌళి, నిర్మాత రిస్క్ చేసినట్లు రానా చెప్పుకొచ్చారు. బాహుబలి 2 వరల్డ్ రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో నిర్మాత అప్పులు చెల్లించడంతో పాటు కొంత లాభాలు ఆర్జించారు. బాహుబలి 2 హిందీలో ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. హిందీలో విడుదల చేసిన కరణ్ జోహార్ పెద్ద మొత్తంలో లబ్ది పొందారని సమాచారం.
బాహుబలి సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ చేసే ధైర్యం ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ సొంతం చేసుకుంది. తన ప్రతిభపై నమ్మకంతో రాజమౌళి సాహసాలు చేశారు. అవి విజయం సాధించాయి. ఆయన నెక్స్ట్ మూవీ బడ్జెట్ రూ. 800 నుండి 1000 కోట్లు. ఇండియాలో ఇంత పెద్ద బడ్జెట్ తో ఎవరు మూవీ చేయలేదు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
