Sravana Masam- Worshiping Trees: హిందూ సంప్రదాయంలో భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందులో శ్రావణమాసంలో పూజలు ఎక్కువగా చేస్తారు. శివుడికి ఇష్టమైన మాసం కావడంతో శివారాధన మీదే ఎక్కువగా దృష్టి పెడతారు. ఉపవాసం చేస్తారు. ఒక్క పొద్దులు ఉంటారు. శివారాధనతో మంచి జరుగుతుందని విశ్వాసం. శ్రావణమాసంలో భక్తి పారవశ్యం పొంగుతుంది. అందరు విధిగా పూజలు ఆచరించడం ఆనవాయితీ. మన ఆచార వ్యవహారాల్లో చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులకు కూడా ప్రాధాన్యం ఉంటుందని తెలిసిందే.

banyan Tree
విష్ణువుకు ఇష్టమని గరుడ పక్షిని, శివుడికి ఇష్టమని పామును, కృష్ణుడికి ఇష్టమని గోవులను పూజించడం సహజమే. వీటితో పాటు వృక్షాలను సైతం పూజించే సంప్రదాయం మనలో ఉండటం విశేషం. అందుకే శ్రావణ మాసంలో ఐదు చెట్లను పూజిస్తే మనకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఆ చెట్లు కూడా మనకు అందుబాటులో ఉండేవే. అవేవో అరణ్యాల్లో ఉండేవి కాదు. మన పరిసరాల్లోనే ఉండే చెట్లు కావడంతో వాటిని పూజిస్తే మనకు అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం.
Also Read: Lakshmi Parvathi : ఉమామహేశ్వరి ఆత్మహత్యపై బాంబు పేల్చిన లక్ష్మీపార్వతి.. సంచలన ఆరోపణ
చెట్లలో ప్రముఖంగా చెప్పబడేది రావి. ఇది దేవతల వృక్షంగా భావిస్తారు. రావి చెట్టుకు నిత్యం ప్రదక్షిణలు చేస్తే సకల రోగాలు పోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. అందుకే రావి చెట్టుకు అంతటి విలువ. ఈ చెట్టు మూలంలో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో సకల దేవతలు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి నిత్యం నీరు అందించి తాకుతుంటే మన రోగాలు దూరమవుతాయని తెలుస్తోంది.
మనకు మంచి చేసే చెట్లలో మర్రి కూడా ఒకటి. దీన్ని వట వృక్షం అంటారు. వటసావిత్రి పండుగ ఈ చెట్టు దగ్గరే జరుపుకుంటారు. మర్రిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుంటారని ప్రతీతి. మర్రిచెట్టును చూస్తే సాక్షాత్తు పరమశివుడిని చూసినట్లే. మర్రిచెట్టుకు పూజ చేస్తే మహిళల భర్తలు దీర్ఘాయువుతో జీవిస్తారని వారి నమ్మకం. అందుకే మర్రికి కూడా ఈ మాసంలో పూజలు చేయడం సహజమే. ఇక మరో చెట్టు ఉసిరి. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఉంటూ వంట చేసుకుని భోజనాలు చేయడం సర్వత్రా మంచిదనే అభిప్రాయం ఉంది. అందుకే ఉసిరిని కూడా దేవతా వృక్షంగా పూజించడం తెలిసిందే. శ్రావణమాసంలో దీన్ని పూజిస్తే లక్ష్మిదేవి సంతోషిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.

Sravana Masam- Worshiping Trees
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వ వృక్షం. ఈ ఆకులంటే శివుడికి మహాఇష్టం. ఈ ఆకులు లేనిదే శివుడి పూజ చేయరు. అంతటి విలువ కలిగిన చెట్టును శ్రావణమాసంలో పూజిస్తే సకల భాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. మారేడు దళం అంటే శివుడికి ఎంతో ఇష్టం కావడంతోనే ఈ ఆకులతో పూజ చేస్తే మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు. మరో వృక్షం వేప. ఇది మన ఇళ్లలో కూడా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీని బెరడు, ఆకులు, పండ్లు అన్ని మనిషికి ఉపయోగపడతాయి. అందుకే దీనికి మంచి ప్రాధాన్యం ఉంది. వేపను పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. దారిద్ర్యం దూరమవుతుంది. రోగాలు పోతాయి. శాంతి కలుగుతుంది. అందుకే వేపను శ్రావణమాసంలో విధిగా పూజిస్తే చాలా మంచి జరుగుతుందని మన పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. మహిళలు ఈ ఐదు చెట్లను పూజించి తమ ఇళ్లల్లో సకల భోగభాగ్యాలు కలిగేలా చేసుకోవాల్సిందే.
Also Read:Prabhas : ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? అమ్మాయి కోసం అలిగిన ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు