Worlds Richest Beggar: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఎవరో తెలుసా

ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వాడిగా గుర్తించారు. అతడి ఆస్తి విలువ రూ.7.5 కోట్లు అని తెలిసింది. ముంబైలో ఇతనికి రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూం ప్లాట్ ఉంది. పూణేలో నెలకు రూ.30 వేలు అద్దె వచ్చే దుకాణాలు ఉన్నాయి. ఇలా ఇంత పెద్ద ఆస్తులున్న అతడు రోజు అడుక్కునే జీవనం కొనసాగిస్తున్నాడు.

  • Written By: Srinivas
  • Published On:
Worlds Richest Beggar: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఎవరో తెలుసా

Worlds Richest Beggar: బిక్షాధికారే లక్షాధికారి అంటారు. ఎందుకంటే పెట్టుబడి లేని సంపాదన. పైగా రోజు ఆదాయం గరిష్టంగానే ఉంటుంది. దీంతో చాలా మంది బిచ్చగాళ్లుగా మారుతున్నారు. సులభంగా వచ్చే రాబడితో రూ. కోట్లు సంపాదిస్తున్నారు. వారి పిల్లలు కాన్వెంట్ ల్లో చదువుతున్నారు. వారి జీవితాల గురించి ఆశ్చర్యం కలగక మానదు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కానీ బిచ్చగాడిగా అవతారమెత్తినా వారి ఆదాయం మాత్రం తగ్గదు. దీంతో రోజుకు వారి సంపాదన ఎంతో తెలిస్తే ఏ ఉద్యోగస్తుడు కూడా అంతటి ఆదాయం సంపాదించలేడు.

రూ.7.5 కోట్ల ఆస్తులు

ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వాడిగా గుర్తించారు. అతడి ఆస్తి విలువ రూ.7.5 కోట్లు అని తెలిసింది. ముంబైలో ఇతనికి రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూం ప్లాట్ ఉంది. పూణేలో నెలకు రూ.30 వేలు అద్దె వచ్చే దుకాణాలు ఉన్నాయి. ఇలా ఇంత పెద్ద ఆస్తులున్న అతడు రోజు అడుక్కునే జీవనం కొనసాగిస్తున్నాడు.

రోజువారీ సంపాదన రూ.2500

ఇతడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. వారు కాన్వెంట్ లో చదువుతున్నారు. ఇతడి రోజు వారి సంపాదన రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకు ఉంటుంది. దీంతో మనం సినిమాల్లో చూసినట్లు బిచ్చగాడే లక్షాధికారి అనడం మామూలే. భరత్ జైన్ సంపాదన ఇంత భారీగా ఉండటంతో అతడు విలాసవంతమైన బతుకు బతుకున్నాడు. బిచ్చమెత్తుకుంటున్నా ఇంత భారీ ఆస్తులు ఉండటం గమనార్హం.

ఆత్మాభిమానం ఒదిలేస్తే..

ఆత్మాభిమానం చంపుకుని అడుక్కు తినేవాడికి అంతా మిగులే. ఖర్చు ఏముంటుంది. పైగా రోజుకు సంపాదన వేలల్లో ఉండటంతో ఇదేదో బాగుందని చాలా మంది ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. పొద్దంతా అడుక్కుని రాత్రి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజు ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తూ మేడలు, మిద్దెలు కడుతున్నారు. చూస్తే బిచ్చగాడి అవతారం.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు