The Safest Countries :ప్రపంచంలో ఒకప్పుడు రాచరిక వ్యవస్థ ఉండేది. రాజులు, రాణులు, యువరాజులు, మంత్రులు ఇలా రాజ్యంలో ఉండేవారు. రాజ్యాలను పాలించేవారు. ప్రజలను పాలిస్తూనే రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాలపై దండెత్తేవారు. సంపదను కొల్లగొట్టేవారు. ఇలా భారత దేశంపైకి ఎంతో మంది రాజులు దండెత్తి వచ్చారు సంపదను దోచుకుపోయారు. చివరకు బ్రిటిష్ పాలకులు ఇండియాను 200 ఏళ్లు పాలించారు. విలువైన సంపదను దోచుకుపోయి.. మనకు పాశ్చాత్య సంస్కృతిన అంటగట్టారు. ఇక ఇప్పుడు ప్రపచంలో దాదాపు ప్రసాజ్యామ పానలే సాగుతోంది. కొన్ని దేశాల్లో సైనిక పాలన సాగుతోంది. అయినా ఆధిపత్యం కోసం చాలా దేశాలు ఇతర దేశాలపై దాడులు చేస్తున్నాయి. ఇక ప్రపంచంలో చాలా దేశాల్లో సంఘ వ్యతిరేక శక్తులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే.. ఈ పరిస్థితుల ఆధారంగా ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను ఏటా విడుదల చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. తాజాగా జాబితా విడుదలైంది. పర్యాటకుల కోసం ఈ జాబితా ఎంతో ఉపయోగపడుతుంది.
అత్యంత సురక్షిత దేశం
ఏదైనా దేశం వెళ్లినప్పుడు అక్కడ భద్రత గురించి మనకు ముందుగా తెలిసి ఉంటే చాలా మంచింది. లేకుంటే చిక్కులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ బెర్క్‌షైర్‌హాత్‌వే ట్రావెల్ తాజాగా ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానం ఐస్లాండ్కు దక్కింది.
పలు అంశాలపై సర్వే
ఈ జాబితాను రూపొందించేందుకు సంస్థ పలు అంశాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో క్రైమ్‌రేట్, మహిళల భద్రత, ఎల్‌జీబీటీఐక్యూ ప్లస్, ప్రయాణికుల అనుభవం, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సేవలు తదితర వివరాలను సేకరించారు. ఈ సంస్థ 2016 నుంచి ఇలా జాబితా విడుదల చేస్తోంది.
2025 సర్వే ఇలా..
గతేడాది ఈ జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. కానీ, ఈసారి మొదటిస్థానం దక్కించుకుంది. ఇది చాలా చిన్న ద్వీపం. కేవలం నాలుగు లక్షల జనాభా ఉంటుంది. ఇక్కడ హింసాత్మక నేరాలు చాలా తక్కువ. పోలీసులు తుపాకులు పట్టరు. ఐస్లాండ్కు సైన్యం కూడా లేదు. 2024లో అనేక అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి. ఇది పర్యాటకుల తాకిడిపై ప్రభావం చూపలేదు.
ఐస్లాండ్లో ఫేమస్ ఇదే..
ఐస్లాండ్ రాజధాని రెక్టావిక్ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటుంది.నగరం నడిబొడ్డున అతిపెద్ద చర్చి పర్యాలకులను ఆకర్షిస్తుంది. ఐస్లాండ్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన మంచు కొండలను దగ్గరి నుంచి చూడొచ్చు. ఈ దేశంలో అందమైన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి.
సురక్షిత దేశాల జాబితాలో..
సురక్షితమైన దేశాల జాబితాలో తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ దేశాన్ని పర్యాటకులకు సురక్షిత దేశంగా భావిస్తారు. నేరాల రేటు కూడా తక్కువగా ఉంటుంది. రవాణా, భద్రత ఉత్తమంగా ఉంటుంది.
కెనడా…
సురక్షితమైన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది కెనడా. ఇక్కడ మహిళలకు ఎల్జీబీటీయ్యూఐ ప్లస్ వర్గాలకు సురక్షితమైనది. నేరాల రేటు తక్కువగా ఉంటుంది. నయాగారా జలపాతం, బాన్స్ నేషనల్ పార్క్ కెడడాలో ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఐర్లాండ్..
ఈ జాబితాలో నాలుగ స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఈ దేశంలో నేరాల రేటు చాలా తక్కువ. ఈ దేశంలో 50 లక్షల జనాభా ఉంటుంది. ప్రకృతి అందాలకు ఐర్లాండ్ నిలయం.
స్విట్జర్లాండ్..
ఇక ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన దేశం స్విట్జర్లాండ్. న్యూజిలాండ్, నార్వే, జర్మనీ, డెన్మార్క్, జపాన్, యూకే, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
న్యూజిలాండ్..
పౌర హక్కుల రక్షణ: న్యూజిలాండ్‌లో ప్రజల హక్కులు, స్వేచ్ఛ, మరియు సమానత్వం చాలా గౌరవించబడతాయి. సమాజంలో ఏ విధమైన వివక్ష, మత వివాదాలు లేదా నేరాలు చాలా తక్కువ.
గ్లోబల్ పీస్ ఇండెక్స్: న్యూజిలాండ్ కూడా ఐస్లాండ్ తరహాలో అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటి. ప్రజల మధ్య మంచి సమాజ బంధం, న్యాయ వ్యవస్థ యొక్క వైశాల్యం ఇది దానికి కారణం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: These are the safest countries in the world do you know why
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com