Site icon OkTelugu

Shopian Madrasa Closure: గౌరవంగా ఎదిగి.. ఉగ్ర గుట్టు బయటపడి.. శోపియా మదరసాకు తాళం!

Shopian Madrasa Closure

Shopian Madrasa Closure

Shopian Madrasa Closure: దక్షిణ కశ్మీర్‌ శోపియాలో 47 ఏళ్ల క్రితం స్థాపించిన జమియా సిరాజుత్‌ ఉలూం మదరసా. ఇది అంటే అందరికీ గౌరవం. అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా అధికారులు, ప్రజాప్రతినిదులు వెళ్లేందుకు పోటీ పడతారు. ఇదొక మత విద్యను బోధించే సంస్థ. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న శోబయాలో పెద్ద పెద్ద ఉద్యమాలు నడుస్తున్న సమయంలోనూ ఆగలేదు. ఏటా 500 నుంచి 800 మంది ఇక్కడ చదువుకుంటారు. ఈ మదరసా అంటే అందరికీ గౌరవం. అయితే ఈ సంస్థకు నీర్‌పూరిత కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) సెక్షన్‌ 8(1) ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఏటా 500 నుంచి 800 మంది విద్యార్థులు చదువుకునే ఈ మదరసా మత విద్యాబోధకంగా కనిపించినా, దాని వెనుక లష్కర్‌–ఏ–తొయిబా, జమాత్‌–ఏ–ఇస్లామీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ దర్యాప్తు బయటపెట్టింది.

ఉగ్ర సంబంధాలు..
మదరసా జమాత్‌–ఏ–ఇస్లామీ ట్రస్ట్‌తో ముడిపడి ఉండటం, ఫండింగ్‌–ఖర్చుల మధ్య అసాధారణ తేడాలు టెర్రర్‌ ఫండింగ్‌కు సూచనలు. పుల్వామా మందుగుండ దాడికి సంబంధించిన సజ్జాద్‌ అహ్మద్‌ భట్‌ ఇక్కడ చదివి 2017 వరకు పనిచేశాడు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన 11 మంది ఉగ్రవాదులు ఈ మదరసాలో చదివినవారే. జైష్‌–ఏ–మహ్మద్, లష్కర్‌ క్యాడర్లు ఈ సంస్థ నుంచే బయటపడ్డారు. టీచర్‌ షౌకత్‌ అలీ షేక్‌ను అరెస్టు చేసినా, పాకిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చిన ఉగ్రాలకు ఆశ్రయం ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాలు గతంలో తెలిసినా, ఎన్‌ఐఏ దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ధైర్యాన్ని చూపుతోంది. ఇది మత విద్యా సంస్థల్లో దాగి ఉన్న రహస్య కేంద్రాలను బహిర్గతం చేసే మైలురాయి.

రాజకీయ, సామాజిక ప్రభావం..
ఐఏఎస్‌లు, రాజకీయ నాయకులు గౌరవించే సంస్థ మూసివేత ఎంఎల్‌ఏలు, అధికారుల మైండ్‌సెట్‌లో మార్పును సూచిస్తుంది. గతేడాది 100కు పైగా జమాత్‌ స్కూళ్లు మూసేసివేసింది. ఈ ఏడాది 50 స్కూళ్లు టేకోవర్‌ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కీలక మదరసాను లక్ష్యంగా చేసుకుంది. ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉగ్రాలకు సహకరిస్తున్నారు. ఇది కశ్మీర్‌లో ఉగ్రవాద శాఖలను కట్టడి వ్యూహంగా కనిపిస్తోంది, కానీ మత స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జమాత్‌–ఏ–ఇస్లామీ పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లో ఉన్నా, కశ్మీర్‌ శాఖకు స్వతంత్రంగా ఉందని వాదనలు బలపడతాయి.

ఈ చర్యలు ఉగ్రవాదాన్ని వేలూనుకోవడంలో ప్రభుత్వానికి బలం ఇస్తాయి కానీ, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ప్రత్యామ్నాయ మత విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, రొగ్డ్‌ ఎలిమెంట్స్‌ను వేరు చేయాలి. గౌరవం, భద్రత మధ్య సమతుల్యత అవసరం. లేకపోతే స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ మదరసా మూసివేత ఉగ్రవాద ఫండింగ్‌ను అడ్డుకునే సంకేతం, కానీ దీర్ఘకాలంలో కశ్మీర్‌ యువతను మెయిన్‌స్ట్రీంలోకి తీసుకురావాలి.

Exit mobile version