Hamza Burhan News: ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన సరే పాకిస్తాన్ తీరు మారదు.. దాని ఉగ్రరూపం మారదు. ప్రపంచ దేశాలు తిట్టిపోసినా సరే.. అంతర్జాతీయ వేదికల ముందు పరువు పోయినా సరే.. పాకిస్తాన్ తీరు అలానే ఉంటుంది. పైగా తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్పే పాకిస్తాన్ పాలకులు.. చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ దేశంలో ఇటీవల హంజా బుర్హాన్ అనే టీచర్ చనిపోయాడు. అజ్ఞాత సాయుధ దళాల చేతిలో అతడు హత్యకు గురయ్యాడు. అతడి అంత్యక్రియలకు ఉగ్రవాద సంస్థల అధినేతలు హాజరయ్యారు. వారంతా చేతిలో తుపాకులు పట్టుకొని అతడికి నివాళులర్పించారు. అంత్యక్రియలు జరిగేవరకు వారు అక్కడే ఉన్నారు. పైగా అతడు వీరమరణం పొందాడని.. అతడి హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు నినాదాలు చేశారు. ఒక సాధారణ టీచర్ చనిపోతే ఈ స్థాయిలో ఉగ్రవాదులు రావడం ఒక రకంగా సంచలనం కలిగించింది. అయితే దీనిని తవ్వి చూస్తే అసలు నిజం వెలుగు చూసింది.
బుర్హాన్ సాధారణ టీచర్ కాదు. పుల్వామా అటాక్ కు సంబంధించి కీలక సూత్రధారి. సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆ దాడికి అతడు స్కెచ్ వేశాడు. అప్పటినుంచి ఇతడి గురించి మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అతడు మారుపేరుతో పాకిస్తాన్ దేశంలో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఒక స్కూల్లో మత బోధనలు చేస్తున్నాడు. విద్యార్థులలో భారత్ మీద విష ప్రచారం చేస్తున్నాడు. వారి మెదళ్లలో విష బీజాలు నాటుతున్నాడు.. అయితే అతడు ఇటీవల అజ్ఞాత సాయుధ దళాల చేతిలో హతమయ్యాడు.. అతడు ఉగ్రవాది అని చెబితే ప్రపంచం మొత్తం ఉవేస్తుందని భావించిన పాకిస్తాన్.. తెలివిగా సానుభూతి కార్డును ప్లే చేస్తోంది.
ఇటీవల అజ్ఞాత సాయుధ దళాల చేతిలో బుర్హాన్ చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు ఉగ్రవాదులు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇతడు చనిపోయిన తర్వాత ఉగ్రవాదులు నినాదాలు చేశారు. అతడి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు పాకిస్తాన్ మీడియా రాసిన కథనాలను ఆధారంగా తీసుకొని వెస్ట్రన్ మీడియా బుర్హాన్ పై సానుభూతి స్టోరీలను ప్రసారం చేసింది.. అతడు ఉగ్రవాది అనే విషయాన్ని తెలివిగా డైవర్ట్ చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఉర్దూకు బదులుగా హిందీలో బుర్హాన్ మీద సానుభూతి వ్యాఖ్యలను పోస్ట్ చేయడం విశేషం. అయితే భారత్ వల్ల పాకిస్తాన్లో అల్లకల్లోలం చెలరేగుతోందని.. ఉగ్రవాదులు మొత్తం మంచి వాళ్ళని.. భారత్ వల్లే ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా పాకిస్తాన్ లోని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ బుర్హాన్ గురించి అసలు విషయాలను కొంతమంది జాతీయవాదులు బయట పెట్టడంతో.. వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
