Site icon OkTelugu

Iran Rejects Pakistan Mediation US Iran Ceasefire: దౌత్యం పేరుతో దళారీగా మారిన పాకిస్తాన్‌.. శాంతి చర్చలను బహిష్కరించిన ఇరాన్‌!

Iran Rejects Pakistan Mediation US Iran Ceasefire

Iran Rejects Pakistan Mediation US Iran Ceasefire

Iran Rejects Pakistan Mediation US Iran Ceasefire: పాకిస్తాన్‌ పరిస్థితి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసిన పెళ్లి పెద్దలా మారింది. ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కుదిర్చామని, రెండు వారాలు యుద్ధం ఆపామని పాకిస్తాన్‌ గొప్పలు చెప్పుకుంది. కాలర్‌ ఎగరేసింది. తర్వాత ఇరు దేశాల ముఖాముఖి చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదిక చేసింది. ఈమేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. దాడులు జరుగకుండా భద్రత పెంచింది. శాంతి చర్చలకు భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ, ఈ చర్చలకు ఇరాన్‌ డుమ్మా కొట్టింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పర్యటన ఆగిపోయింది. మధ్యవర్తిత్వం చేసి శాంతి కుదిర్చామని చెప్పుకున్న పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చారు.

ఇస్లామాబాద్‌లో ఏర్పాట్లు..
శాంతి చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదిక చేసిన పాకిస్తాన్, భారీ ఏర్పాట్లు చేసింది. దాడులు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే, ఈ చర్చలకు ఇరాన్‌ రాకపోవడం, అమెరికా ప్రతినిధి బృందం రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. మధ్యవర్తిత్వం చేసి శాంతి కుదిర్చామని చెప్పుకున్న పాకిస్తాన్‌ పరువు పోయింది.

పాకిస్తాన్‌పై నమ్మకం కోల్పోయిన ఇరాన్‌..
పాకిస్తాన్‌ను ఇరాన్‌ నమ్మడం లేదు, ఇజ్రాయెల్‌ నమ్మడం లేదు. ఈ అనమ్మకానికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ అనుసరించిన ద్విముఖ విధానం. ఇరాన్‌ మొదట పెట్టిన పది షరతులకు, ఇప్పుడు చెబుతున్న షరతులకు సంబంధం లేదు. ఇరాన్‌ షరతులను కూడా పాకిస్తాన్‌ అమెరికాకు సరిగ్గా అందించలేదు. మార్చి పాకిస్తాన్‌ సొంతంగా తయారు చేసిన షరతులను అమెరికాకు అందించింది. దీంతో పాకిస్తాన్‌ నమ్మదగ్గది కాదని, చర్చలకు ఏర్పాట్లు సరిగ్గా చేయడం లేదని ఇరాన్‌ భావిస్తోంది.

ఇజ్రాయెల్‌ దాడులతో సీజ్‌ఫైర్‌ బ్రేక్‌
మరోవైపు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడం, దానికి ప్రతికారంగా ఇరాన్‌ కువైట్‌పై దాడులు చేయడంతో యుద్ధ విరామం ఎక్కడా జరగలేదు. సీజ్‌ఫైర్‌ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించడం, ఇరాన్‌ ప్రతిదాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

ఖవాజా ఆసిఫ్‌ ట్వీట్‌పై ఇజ్రాయెల్‌ ఆగ్రహం
పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ తాజాగా ఒక ట్వీట్‌ చేశాడు. ఇజ్రాయెల్‌ను నామరూపాలు లేకుండా చేయాలని అందులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పాకిస్తాన్‌ పాలకుల్లో తమపై ఇలాంటి భావనలు ఉన్నప్పుడు చర్చలు ఎందుకు?‘ అని ఇజ్రాయెల్‌ ప్రశ్నించింది. ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు శాంతి చర్చలకు అంతరాయం కలిగించాయని ఇజ్రాయెల్‌ విమర్శించింది.

అమెరికాకు ఊడిగం చేసిన పాకిస్తాన్‌..
అమెరికా ఒత్తిడికి లొంగి చేసిన అసంబంధమైన సీజ్‌ఫైర్‌ కారణంగా ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలు జరగలేదు. అమెరికా ఈ సీజ్‌ఫైర్‌ను తన బలం పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. కానీ, ఇరాన్‌ ఈ ఒప్పందాన్ని నమ్మడం లేదు. హార్ముజ్‌ జలసంధిని మూసివేసి, అమెరికాపై ఆర్థిక ఒత్తిడి తెస్తోంది.

దౌత్యం చేస్తాం.. దళారీ కాదు..
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ యుద్ధం గురించి వివరిస్తూ, ‘భారత్‌ ఏం చేస్తుంది? యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తుందా?‘ అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘దౌత్యం చేస్తాం.. కానీ దళారీగా మారం‘ అని జైశంకర్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లా ఊడిగం చేయమని తేల్చి చెప్పారు. భారత్‌ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని, అమెరికా ఒత్తిడికి లొంగి పనిచేయదని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ హార్ముజ్‌ను మూసివేసింది, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తుంది. అమెరికా ఆర్థిక ఒత్తిడి తెస్తోంది. ఈ పరిస్థితిలో శాంతి చర్చలు జరగాలంటే, మూడు దేశాల మధ్య నమ్మకం కుదరాలి. పాకిస్తాన్‌ లాగా దళారీం చేయకుండా, భారత్‌ లాగా స్వతంత్ర విధానాన్ని అనుసరించే దేశం మధ్యవర్తిత్వం వహిస్తేనే శాంతి నెలకొనే అవకాశం ఉంది.

Exit mobile version