Site icon OkTelugu

Ebola Outbreak Concern: ఎబోలా మరో కరోనా కానుందా.. ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు

Ebola Outbreak Concern

Ebola Outbreak Concern

Ebola Outbreak Concern: ప్రపంచ ఆరోగ్య రంగంలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆఫ్రికాలోని డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఉగాండాలో కొత్త ఎబోలా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అలర్ట్‌ అయింది. విమానాశ్రయ స్క్రీనింగ్, ప్రయాణ నిబంధనలు కఠినతరం చేసింది. ఈ చర్యలు రాబోయే రోజుల్లో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

మళ్లీ ముప్పుగా మారిత ఎబోలా?
ఇటీవలి వారాల్లో ఆఫ్రికాలోని ఇటురి ప్రావిన్స్‌లో బుండిబుగ్యో స్ట్రెయిన్‌ ఎబోలా వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది. ఈ స్ట్రెయిన్‌కు ప్రస్తుతం ప్రత్యేక వ్యాక్సిన్‌ లేదు. మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇప్పటికే ఉగాండాలోకి కూడా వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. అమెరికాలో ఒక అమెరికన్‌ ఎబోలా బారిన పడినట్లు సమాచారం నేపథ్యంలో ట్రావెల్‌ రూల్స్‌ను కఠినతరం చేసింది. డ్రామాటిక్‌ రెస్ట్రిక్షన్లలో భాగంగా, డెమొక్రటిర్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఉగాండా, సౌత్‌ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలను వాషింగ్టన్‌ డల్లెస్‌ ఎయిర్‌పోర్టుకు మాత్రమే మార్చి, అక్కడ విస్తృత స్క్రీనింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు.

ట్రంప్‌ ప్రభుత్వం స్పందన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయంపై స్పందిస్తూ, ‘‘ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికాకు మాత్రమే పరిమితమై ఉంది’’ అని చెప్పారు. అయితే ఆయన ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేవలం స్క్రీనింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, కొన్ని దేశాల నుంచి వచ్చే విదేశీయులకు ఎంట్రీ రెస్ట్రిక్షన్లు విధించడం వరకు విస్తరించాయి. ఈ నిర్ణయాలు సమయోచితమని ఆరోగ్య నిపుణులు ఒకవైపు చెబుతున్నా, మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వం గ్లోబల్‌ హెల్త్‌ ఫండింగ్‌లను తగ్గించడం వల్ల ఆఫ్రికాలోని ఎబోలా నియంత్రణ చర్యలు బలహీనపడ్డాయని విమర్శలు వస్తున్నాయి. మెమోరియల్‌ డే వంటి ట్రావెల్‌ సీజన్‌లో ఈ నిబంధనలు అమెరికా వెళ్లే యాత్రికులకు ఇబ్బంది కలిగించవచ్చు.

ఆర్థిక ప్రభావం…
ఆఫ్రికా దేశాలతో వాణిజ్య, ప్రయాణ సంబంధాలు దెబ్బతినవచ్చు. ఎబోలా సులభంగా వ్యాపించే వ్యాధి కాకపోయినా, ఆధునిక ప్రయాణ సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో జాగ్రత్త అవసరం.అమెరికా తీసుకున్న చర్యలు ఇతర దేశాలకు హెచ్చరికగా మారి, ప్రపంచవ్యాప్తంగా స్క్రీనింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడవచ్చు.

జాగ్రత్తతోపాటు సహకారం కావాలిఅమెరికా చేపట్టిన ఈ కఠిన చర్యలు స్వల్పకాలిక రక్షణకు మంచివే అయినా, దీర్ఘకాలిక పరిష్కారం ఆఫ్రికాలోని ఆరోగ్య వ్యవస్థలను బలపరచడంలో ఉంది. ఎబోలా వంటి అంటువ్యాధులు ఏ దేశానికీ సరిహద్దులు గౌరవించవు. కాబట్టి అమెరికా, యూరప్, ఆసియా దేశాలు కలిసి ఆఫ్రికాకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మళ్లీ ఒకసారి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భయపడకుండా, సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇప్పటి అవసరం.

Exit mobile version