Site icon OkTelugu

Iran Vs USA Tensions: ఇరాన్‌ బ్రహ్మాస్త్రం సిద్ధం.. అమెరికాకు ఇక దబిడి దిబిడే!

Iran Vs USA Tensions

Iran Vs USA Tensions

Iran Vs USA Tensions: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌–అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. అర్ధంతరంగా ఆగిపోయాయి. మొదటి దశలో విఫలమయ్యాయి. ఈ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌లో ఇరాన్‌ను బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నాడు. రోజుకో పోస్టులో భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఇరాన్‌ ట్రంప్‌ బెదిరింపులను లైట్‌ తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థికంగా అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇరాన్‌.. ఈసారి తమ జోలికి వస్తే కొత్త రకం ఆయుధం ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌ ధైర్యం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.

అమెరికా గుండెలు అదిరే ఆయుధం..
అమెరికాతో రెండో విడత చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌ తన ’సూపర్‌ టార్పెడో’ రహస్యాన్ని వెల్లడించింది. నేవీ కమాండర్‌ షహ్రామ్‌ ఇరానీ ’శత్రువుల గుండెలు పేలిపోతాయి’ అని హెచ్చరించారు. హూట్‌ రాకెట్‌ టార్పెడోగా గుర్తించబడిన ఈ ఆయుధం 2006 పరీక్షల నుంచి ఇరాన్‌ ఆయుధ సంప్రదాయంలో ముఖ్య భాగం. కానీ ఇది సముద్ర యుద్ధాల్లో విప్లవాత్మక మార్పునా, లేక డిప్లొమసీ ఒత్తిడికి మాత్రమేనా అన్న సందేహాలు వ్యక్తమువుతున్నాయి.

వేగం మాయా
హూట్‌ను భారీ తిమింగలంగా పిలుస్తూ ఇరాన్‌ దావా చేస్తోంది. నీటి నిరోధకతను అధిగమించి గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. గ్యాస్‌ బుడగ ద్వారా కావిటేషన్‌ ప్రభావంతో 200 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లి యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లను ధ్వంసం చేయగలదు. రష్యా సూపర్‌ కావిటేటింగ్‌ టార్పెడోలతో పోల్చితే వేగంలో ముందు ఉంది. హార్మూజ్‌ జలసంధి వంటి పరిమిత ప్రాంతాల్లో ఆకస్మిక దాడులకు అవకాశం ఉంది. ఇది ఇరాన్‌ సముద్ర శక్తిని గణనీయంగా పెంచుతుందని అంగీకరించాలి. ప్రాంతీయ ఆధిక్యానికి ముఖ్య ఆయుధం.

బలహీనతలు ఇవీ..
అయితే, అధిక వేగం ఇంధనాన్ని త్వరగా ముగించి పరిధిని 15 కి.మీ.కు పరిమితం చేస్తుంది. సాధారణ టార్పెడోలు 30 కి.మీ. సాగుతాయి. శబ్దం, వేగం వల్ల లక్ష్య ఛేదన కష్టం. యుద్ధక్షేత్ర పరీక్షలు లేకపోవడం ఇరాన్‌ దావాలకు ప్రశ్నలు లేవనెత్తుతోంది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ వంటి అమెరికా విమానవాహక నౌకల రక్షణ వ్యవస్థలు దగ్గరి దూరాల్లో కూడా హూట్‌ను అడ్డుకోగలవు. ఫలితంగా, ఇది ప్రచార ఆయుధంగా మిగిలిపోతుందా? ఇరాన్‌ ఈ పరిమితులను దాటి స్వదేశీ సాంకేతికతతో మెరుగుపడుతుందా అదేఇ చూడాలి.

ఆత్మరక్షణ ఆయుధం
హూట్‌ ప్రకటన అమెరికా నౌకలను హార్మూజ్‌కు దూరంగా ఉంచి చర్చల్లో బలం తెచ్చుకుంటోంది. రష్యా సహకారంతో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీ మధ్యప్రాచ్య సమతుల్యతను భంగపరుస్తుంది. కానీ యుద్ధ రంగంలో విఫలమైతే ఇరాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ శక్తులు ఇలాంటి ఆయుధాల అంతర్జాతీయ నియంత్రణలపై చర్చించాలి. ఆయుధ పోటీ మధ్యప్రాచ్యలో మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.

మొత్తంగా, హూట్‌ ఇరాన్‌ స్వయం సమృద్ధి పయనానికి సంకేతం కానీ, దాని పరిమితులు దాన్ని పెద్ద గొప్పగా మార్చవచ్చు. ఇరాన్‌ ఈ బెదిరింపును డిప్లొమసీకి ఉపయోగించి శాంతి చర్చల వైపు మళ్లాలి. యుద్ధ బెదిరింపులు ఎప్పటికీ శాశ్వత పరిష్కారాలు కావు.

Exit mobile version