Site icon OkTelugu

America Iran Peace Talks 2026: అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. అర్ధరాత్రి హైడ్రామా.. ఏం జరిగిందంటే?

America Iran War Analysis

America Iran War Analysis

America Iran Peace Talks 2026: అమెరికా–ఇరాన్‌ మద్య సీజ్‌ఫైర్‌ కుదిరిన కొన్ని గంటలకే అది బ్రేక్‌ అయింది. ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. దీంతో 200 మందికిపైగా సామాన్యులు మరణించారు. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధి మూసివేసింది. మరోవైపు ఏప్రిల్‌ 10న ఇస్లామాబాద్‌ వేదికగా జరగాల్సిన ఇరు దేశాల ముఖాముఖి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు ఇరాన్‌ హాజర కాలేదు. దీంతో అమెరికా ప్రతినిధుల రాక కూడా ఆగిపోయింది. దీంతో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అన్న ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అర్ధరాత్రి హైడ్రామా తర్వాత చర్చలకు మార్గం సుగమమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ముందుగా ఇస్లామాబాద్‌ చేరుకున్నారు, గత అర్ధరాత్రి ఇరాన్‌ ప్రతినిధులు (ఫారిన్‌ మినిస్ట్రీ అధికారులు, మిలిటరీ అడ్వైజర్లు) ప్రవేశించారు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో జరిగే ఈ మల్టీ–ల్యాటరల్‌ టాక్స్‌ రెండు వారాల యుద్ధ విరామం నేపథ్యంలో జరుగుతున్నాయి. ఇందులో ఐక్యరాజ్యసమితి, అరబ్‌ లీగ్‌ ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

లెబనాన్‌పై దాడులతో టెన్షన్‌..
ఇజ్రాయిల్‌ లెబనాన్‌పై తీవ్ర ఏర్‌ – గ్రౌండ్‌ దాడులు చేపట్టింది. బెయిరూట్, దక్షిణ లెబనాన్‌లో 300కి పైగా మరణాలు, వేలాది గాయాలు. హెజ్బుల్లా బేస్‌లు, ఆయుధ డెపోలు టార్గెట్‌ చేశారు. ఇజ్రాయిల్‌ ‘హెజ్బుల్లా థ్రెట్‌ అంతం‘ అని ప్రకటించి, కాల్పుల విరామం వర్తించదని స్పష్టం చేసింది. అమెరికా ‘సెల్ఫ్‌–డిఫెన్స్‌‘ అని మద్దతు తెలిపింది.

ఇరాన్‌ ఆగ్రహం..
లెబనాన్‌పై దాడులు ఇరాన్‌కు కోపం తెప్పించింది. దాడులు ఆగకపోతే తాము ప్రతీకార చర్యలకు దిగుతామని ఇరాన్‌ హెచ్చరించింది. అభ్యంతరాలు వ్యక్తం చేసి చర్చలు బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించింది. ఒత్తిడికి లొంగి ప్రతినిధులు హాజరయ్యారు. ఇది డిప్లొమటిక్‌ కాంప్రమైజ్‌గా కనిపిస్తుంది.

ఇస్తామాబాద్‌కు ఇరాన్‌ ప్రతినిధులు..
మరోవైపు ఇరాన్‌ ప్రతినిధులు కూడా శనివారం(ఏప్రిల్‌ 11న) ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. ఇరు దేశాల ప్రతినిదుల మధ్య ముఖాముఖి చర్చలు జరుగనున్నాయి. అమెరికా, ఇరాన్‌ రెండూ పాకిస్తాన్‌ ద్వారా తమ ప్రతిపాదనలు పంపించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగే శాంతి చర్చలు ఏమేరకు ఫలిస్తాయి అన్న ఉత్కంఠ అయితే నెలకొంది.

పాకిస్తాన్‌ ఇరాన్‌తో పొరుగు దేశంగా, అమెరికాతో మైత్రి దేశంగా బ్యాలెన్స్‌ చేస్తోంది. జేడీ వాన్స్‌ హాజరు అమెరికా ఇజ్రాయిల్‌ మద్దతును బ్యాలెన్స్‌ చేసే ప్రయత్నంగా చూడవచ్చు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్‌ పాకిస్తాన్‌ను ఇప్పటికీ నమ్మడం లేదు. ఖవాజా ఆసిఫ్‌ ట్వీట్‌ కూడా చర్చల్లో ప్రతిష్టంభనకు ఓ కారణం అయింది.

Exit mobile version