CWC Meeting In Hyderabad: గెలుపే లక్ష్యంగా పని చేయండి.. పార్టీ శ్రేణులకు సోనియా పిలుపు
నేతలు మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. వీలైతే మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

CWC Meeting In Hyderabad: కాంగ్రెస్ శ్రేణులను పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. మీడియా ముందుకు వచ్చినపుడు సమన్వయం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కోరారు. రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా సోనియా కీలక సూచనలు చేశారు.
మీడియాతో జాగ్రత్త..
నేతలు మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. వీలైతే మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.
తుక్కుగూడలో గ్యారెంటీ వారాలు..
ఇక సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను సభ వేదికగా తెలంగాణ ప్రజలకు వివరించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మహిళా ఓటర్లే టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించారు.
కాంగ్రెస్ గ్యారెంటీస్ ఇవే..
*మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
*రూ.500 లకే గ్యాస్ సిలిండర్
*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం.
*వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్
*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
* రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
