TANA Women’s Day Celebrations: ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలను చికాగోలో మార్చి 12వ తేదీ ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. డా. ఉమా ఆరమండ్ల (తానా సర్వీసెస్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో ఈ మిడ్ వెస్ట్ లో ప్రప్రథమంగా మహిళా దినోత్సవ వేడుకలు శుభారంభంగా జరగడం ఎంతో శుభపరిణామం. ఈ వేడుకల్లో ‘తానా’ అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు, ‘తానా’ కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీ రాజా కసుకర్తి, ‘తానా’ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ శశాంక్ యార్లగడ్డ, ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే , ‘తానా’ మీడియా చైర్ శ్రీటాగోర్ మలినేని, ‘తానా’ రీజినల్ రిప్రజెంటేటివ్ , సౌత్ యూనిట్ శ్రీ కిషోర్ యార్లగడ్డ మరియు కమిటీ సభ్యులు అందరూ, నేషనల్ కో చైర్స్, వెంకట్ బిత్రా, రామకృష్ణ కృష్ణస్వామి, ఫణి వేగుంట తదితరులు హాజరయ్యారు.

Dr Uma Aramandla Katiki
లోకల్ గా హేమ కానూరు, యుగందర్ యడ్లపాటి, , శ్రీ కృష్ణ మోహన్, శ్రీమతి రజినీ ఆకురాతి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ కౌన్సిల్ జనరల్ Dr.అమిత్ కుమార్, మరియు శ్రీమతి సురభి కుమార్, అదే విధంగా కాంగ్రెస్ మ్యాన్ రాజా కృష్ణమూర్తి, స్టేట్ సెనెటర్ రామ్ విల్లివాలమ్ హాజరయ్యి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం కావాలని తమ అమూల్యమైన ఆశీస్సులు అందించారు.

Womens Day Celebrations
ఈ బృహత్ కార్యక్రమంలో డా. ఉమా ఆరమండ్ల కటికిగారు చికాగోలో పేరెన్నికిగన్న పదవులలో ఉన్న మహిళా లీడర్స్ ను శాలువాతో సన్మానించారు. అలాగే, అనాధ భాలికల స్థితిగతులు మెరుగు పరిచి, వారి భవిష్యత్తు బంగారు బాటకు ఊపిరి అద్దడానికి ‘తానా’ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘చేయూత’కి 1700 డాలర్లను సైతం సేకరించారు. దీనివల్ల ఎందరో అనాథ బాలికలకు అపూర్వమైన, అద్భుతమైన చేయూత దొరికినట్టు అయ్యింది.

Dr Uma Aramandla Katiki
సన్మానం అనంతరం మహిళలు అందరూ అదే వేదిక పై గ్లామర్ ర్యాంప్ వాక్ లతో ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపారు. క్రియేటివ్ ఐడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్యాషన్ షో అందరినీ అమితంగా ఆకర్షించింది. తర్వాత డాన్స్ ఫ్లోర్ ఓపెన్ కావడంతో మహిళలు ఉత్సాహంగా డ్యాన్సులు వేసి సంతోషించారు. ప్రణతి త్రిపుర యాంకరింగ్ ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.

Womens Day Celebrations
ఈ కార్యక్రమం కోసం తమ సేవలందించి తనకు సహకరించిన వారికి డా. ఉమా ఆరమండ్ల కటికిగారు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా హేమ అద్దంకి, ప్రణతి, శాంతి లక్కంసని, శ్రీలత గరికపాటి, సంధ్య అద్దంకి, అనిత కాట్రగడ్డ, శ్రీదేవి దొంతి, కిరణ్ వంకాయపాటి, శ్రీ గురు స్వామి’లకు.. డా. ఉమా ఆరమండ్ల కటికిగారు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు.