Women Umpires: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్న 33 శాతం రిజర్వేషన్ వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కండక్టర్లు, డ్రైవర్లు, పైలెట్లుగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పిలిచిన మగువలకు ప్రస్తుతం అన్ని అవకాశాలు వారిని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. దీంతో ఆత్మాభిమానం కోసం ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న రిజర్వేషన్ ను వారు సద్వినయోగం చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో మహిళలకు నూతన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో ఒక రంగమేమిటి అన్నింట్లో కూడా వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది.

Women Umpires
క్రికెట్లో ఆడవారికి కూడా చోటు కల్పిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక టీం ఉండటం గమనార్హం. మగువలను కామెంటర్లుగా ఇప్పటికే నియమించింది. భవిష్యత్ లో వారిని అంపైర్లుగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే రంజీ మ్యాచ్ ల్లో మహిళా అంపైర్లు రానున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ వినూత్న నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ లోను వీరి ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వృందారతి, గాయత్రి, జనని మహిళా అంపైర్లుగా ఉన్నారు. దీంతో వారి సంఖ్య పెంచేందుకు నిర్ణయం తీసుకుంటోంది. మహిళా అంపైర్లుగా మరికొందరు రానున్నారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆడవారికి మంచి అవకాశాలు తీసుకొచ్చేలా ఉంది. భవిష్యత్ లో వారికి అన్ని మంచి నిర్ణయాలు వారిని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయని చెబుతున్నారు.

Women Umpires
క్రికెట్లో పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం పెంచేందుకు సిద్ధపడుతున్నట్లు వారి ఏర్పాట్లు ఉంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో కూడా వారికి మంచి స్థానం కల్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో మహిళలను కూడా పురుషులతో సమానంగా చూసే క్రమంలో వారికి కామెంటర్లు, అంపైర్లుగా నియమించనున్నారు. ఆడవారిని కూడా ఆటలో ఉండేలా చేస్తే మరిన్ని మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయని బీసీసీఐ భావిస్తోంది. దీని కోసమే వారిని భాగస్వాములను చేసేందుకు సమ్మతిస్తోంది.