Ind vs Aus t20 tickets: ప్రాణం మీదకు తెచ్చిన క్రికెట్ పిచ్చి
Ind vs Aus t20 tickets క్రికెట్ పిచ్చి ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో టీమిండియా ఆడే మ్యాచ్ ను నిర్వహించడం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదాలు, నిధుల లొల్లి, అధ్యక్షుడిపై తిరుగుబాటుతో బీసీసీఐ అస్సలు మ్యాచ్ లే కేటాయించడం లేదు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ను హైదరాబాద్ కు కేటాయించారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో భారత్-ఆస్ట్రేలియా […]

Ind vs Aus t20 tickets క్రికెట్ పిచ్చి ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో టీమిండియా ఆడే మ్యాచ్ ను నిర్వహించడం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదాలు, నిధుల లొల్లి, అధ్యక్షుడిపై తిరుగుబాటుతో బీసీసీఐ అస్సలు మ్యాచ్ లే కేటాయించడం లేదు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ను హైదరాబాద్ కు కేటాయించారు.
ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ చూసేందుకు జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారు. టీ20 టికెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాటలో గాయపడ్డ ఒక మహిళ చనిపోయింది. గేటు దగ్గర జరిగిన తొక్కిసలాటలో సృహ కోల్పోయిన మహిళను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మహిళ ప్రాణాలు కోల్పోయింది.
మహిళను బ్రతికించేందుకు పోలీసులు సీపీఆర్ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం దక్కలేదు. ఈ తొక్కిసలాటలో 20 మందికి గాయాలయ్యాయి. అప్పటికే టికెట్ల కోసం యువకులు బాగా తరలివచ్చారు. టికెట్ల కోసం ఎగబడ్డారు. క్రికెట్ పిచ్చితో వచ్చిన మహిళ ఇందులో ఇరుక్కొని తొ ప్రాణాలు పోగొట్టుకుంది.
కాగా ఒక్కరికి 2 టికెట్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో టికెట్లు సరిపోక తొక్కిసలాటలు, గొడవలు జరుగుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. టికెట్ల జారీలో జాప్యం చేయడమే ఆ మహిళ ప్రాణాలు పోవడానికి కారణం అంటున్నారు. హెచ్.సీ.ఏ అసంబద్ధ టికెట్ల విక్రయం దీనికి కారణం అంటున్నారు. టికెట్ల కోసం ఇవాళ ఉదయం 4 గంటల నుంచి స్టేడియం వద్ద క్యూలు పెట్టారంటే మ్యాచ్ కోసం ఎంతగా ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో ఈరోజు క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జ్ దారుణం. ఇది పూర్తిగా హెచ్ సిఏ మరియు ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ నేత దాసోజ్ శ్రవణ్ విమర్శించాడు. టికెట్లు బ్లాక్ లో అమ్మడం, ఇంకా అనేక అక్రమాలు.. #HCA యాజమాన్యంపై, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశవారు.
