Adipurush: హాలీవుడ్ సినిమా దెబ్బకి ‘ఆదిపురుష్’ అవుట్.. విడుదలకు ముందే ఎన్ని కోట్ల రూపాయిలు నష్టం వచ్చిందో తెలుసా!

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో మనకి కనిపిస్తున్న వానర సైన్యం మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తోనే చేసారు.

  • Written By: Vicky
  • Published On:
Adipurush: హాలీవుడ్ సినిమా దెబ్బకి ‘ఆదిపురుష్’ అవుట్.. విడుదలకు ముందే ఎన్ని కోట్ల రూపాయిలు నష్టం వచ్చిందో తెలుసా!

Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మరియు ట్రైలర్ ఆడియన్స్ నుండి అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇంత రిచ్ గా రామాయణం ఈమధ్య కాలం లో ఏ దర్శక నిర్మాత కూడా తియ్యలేదు.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో మనకి కనిపిస్తున్న వానర సైన్యం మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తోనే చేసారు. అందుకే రియాలిటీ కి చాలా దగ్గర్లో ఉన్నట్టుగా అనిపించింది. క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది, నేడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతి లో ఘనంగా కనీవినీ ఎరుగని రీతిలో చెయ్యనున్నారు. అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చిరకాలం గుర్తించుకుంటారట.

ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి షోస్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే అదే రోజు హాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘ఫ్లాష్’ కూడా విడుదల కాబోతుంది. దీనితో షోస్ అన్నీ కూడా ఆ సినిమాకే వెళ్లిపోతున్నాయి. టీ సిరీస్ సంస్థ ఆదిపురుష్ చిత్రానికి షోస్ రప్పించడం లో విఫలం అవుతుంది. ఇప్పటి వరకు కేవలం 300 షోస్ మాత్రమే యాడ్ అయ్యాయి. 2D అడ్వాన్స్ బుకింగ్స్ చాల్ వీక్ గా ఉన్నప్పటికీ, 3D అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయి.

కానీ 3D షోస్ కేవలం 50 మాత్రమే దొరికాయి, ఫైనల్ కౌంట్ వంద కి అయినా రీచ్ అవుతుందా అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటే, ఈ సినిమా 5 లక్షల డాలర్స్ ని ప్రీమియర్స్ నుండి రాబట్టే ఛాన్స్ ఉందట. 1 మిలియన్ డాలర్లు రాబట్టాల్సిన సినిమా, కేవలం 5 లక్షల డాలర్లు దగ్గరే ఆగిపోయింది.అంతే ఇండియన్ కరెన్సీ ప్రకారం నాలుగు కోట్ల రూపాయిలు నష్టం అన్నమాట.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు