Congress High Command: తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచించిన విషయాలను నేరుగా అమలు పరిచేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టెక్కి అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. దీనికి గాను కొన్ని నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నారు. దీంతో సీనియర్ నేతల్లో భయం పట్టుకుంది. ఈ సారి తము టికెట్లు వస్తాయో రావో అనే ఆందోళన నెలకొంది.

Rahul Gandhi
ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలపడేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తోంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ నేతల్ల నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. దీని కోసం సీనియర్లు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు ఇక ఐపీఎల్ లో ఆడడం లేదా?
ఎన్నికల వ్యూహకర్త సునీల్ అంచనాల ప్రకారం వరుసగా రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వకూడదనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనికి రాహుల్ గాంధీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అలజడి మొదలైంది. తమకు టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని పట్టుకుని వేలాడితే ఇదా ఫలితం అని లోలోపలే కుమిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం మాత్రం పార్టీ కోసం త్యాగాలు చేయాల్సిన అవసరమొచ్చిందని చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం సేవలు చేసినా ఇప్పుడు తప్పుకుని పార్టీని బతికించండి అని చెబుతుతోంది

Sunil
.
కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు అవలంభించిన మూస పద్ధతులకు స్వస్తి పలికి నూతన విధానాలు పాటించాలని చూస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో రాహుల్ గాంధీ ఆలోచనల్లో ఇంకా ఏవైనా మార్పులుంటాయా? అనే కలవరం నేతల్లో మొదలైంది. భవిష్యత్ లో పార్టీని అధికారంలో నిలిపే ప్రయత్నంలో ఎలాంటి నిర్ణయాలైనా అందరు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైందని సమాచారం. ఎవరెవరి సీట్లు ఎగిరిపోతాయో ఎవరికి మొండిచేయి చూపిస్తారో కూడా తెలియడం లేదు.
Also Read: KTR Target: అమిత్ షాను టార్గెట్ చేసిన కేటీఆర్