Winter Session 2022- PM Modi: అందరికీ కొన్ని వీక్ నెస్ లు ఉంటాయి. బాగా రాసేవారు సరిగ్గా స్టేజ్ మీద మాట్లాడలేరు. ఇక మంచి వక్త బాగా రాయలేడు. ఇలా రెండు పనులు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా మీడియా ముందర ధైర్యంగా మాట్లాడడం ఒక కళ. తెలుగు నాట కేసీఆర్ ఆ పని చేయగలరు. ప్రశ్నలు వేసే సీనియర్ జర్నలిస్టులను కూడా దబాయించగలరు. ఇక మీడియాను ఎదుర్కోవడానికి సీఎం జగన్ తటపాయిస్తుంటారు. న్యూస్ ఛానెల్స్ లో ఆయన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు చాలా తక్కువ. చంద్రబాబు ఇంకాస్త నయమే. కానీ ఆయన కమ్మ మీడియాకే ఇంటర్వ్యూలు ఇస్తూ సేఫ్ సైడ్ లో ప్రశ్నలు అడిగేలా మంత్రాంగం జరుపుతారు.

PM Modi
రాష్ట్ర నేతల పరిస్థితి ఇలా ఉంటే.. దేశానికి 8 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీకి కూడా మీడియా ఫోబియా ఉంది. ఆయన దిగ్గజ సీనియర్ జర్నలిస్టులను ముఖాముఖి ఫేస్ చేయలేడు. గత 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ బీజేపీ ఆఫీసులోనూ విలేకరుల సమావేశంలో సైలెంట్ గా కూర్చుంటే అమిత్ షా అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో విలేకరుల ముప్పేట ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఓడినా.. గెలిచినా తనదే బాధ్యత అంటాడు. అమిత్ షా మీడియాతో ముఖాముఖిని బాగానే హ్యాండిల్ చేస్తాడు. కానీ మోడీయే కాస్త తటపటాయిస్తాడు. అందుకే తనే మన్ కీ బాత్ అంటూ.. డీడీ చానెల్ ఎదుట ఒక్కడే మాట్లాడి ఆ వీడియోను విడుదల చేస్తుంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మీడియాతో నేరుగా మాట్లాడరు మోడీ. కేవలం సభలు, సమావేశాల్లోనే ప్రజలతో మాట్లాడుతారు. నరేంద్రమోడీకి ఈ భయం గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే కలిగింది.
నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న రోజులవీ. సీఎన్ఎన్ ఐబీఎన్ భీకర జర్నలిస్టు కరణ్ థాపర్ తో లైవ్ ఇంటర్వ్యూకు మోడీ వచ్చాడు. గోద్రా అల్లర్లు, హత్యల వెనుక కారణాలపై మోడీని గుక్కతిప్పుకోకుండా కరణ్ ప్రశ్నించేసరికి తట్టుకోలేని మోడీ మధ్యలోనే ఇంటర్వ్యూ ఆపి వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వతంత్ర, తెలివైన జర్నలిస్టులతో ఇంటర్వ్యూలకు మోడీ రావడం లేదు. గడిచిన ఐదేళ్లలో తనకు దగ్గరైన వారితోనే ఇంటర్వ్యూలు చేయించుకొని మమ అనిపించారు. అక్షయ్ కుమార్ తోపాటు బీజేపీ వాది అయిన అర్నాబ్ గోస్వామి ఇలా తమకు అనుకూలురైనా.. ఇబ్బంది పెట్టని జర్నలిస్టులతోనే మోడీ ఒకటి రెండు ఇంటర్వ్యూలు చేశాడు. జర్నలిస్టులంటే మోడీకి ఉన్న భయం, ఫోబియా ఇప్పటికీ పోలేదంటారు.

PM Modi
కానీ తాజాగా మోడీ మారాడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నరేంద్రమోడీ నేరుగా మీడియాతో ముచ్చటించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సెక్రటరీ మీడియాకు వర్తమానం పంపారు. సభలు, సమావేశాల్లోనే మాట్లాడే మోడీ నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో మోడీ తొలిసారి మీడియాను ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తి రేపుతోంది.
ఇదివరకూ చాలా సార్లు మీడియాను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడిన మోడీ.. బుధవారం ఏం మాట్లాడుతాడు? మాట్లాడితే ఏ అంశాలు ప్రస్తావిస్తారు? మీడియా ప్రశ్నలు ఎలా ఉంటాయి? వాటికి సమాధానం ఇస్తాడా? అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.