Salman Khan: సల్మాన్ నన్ను పెళ్లి చేసుకుంటావా?… హాలీవుడ్ లేడీ రిపోర్టర్ ప్రశ్నకు ఆయన షాకింగ్ ఆన్సర్!
నువ్వు ఓ 20 ఏళ్ల క్రితం నన్ను కలవాల్సిందని సల్మాన్ సమాధానం చెప్పాడు. పెళ్లి చేసుకునే ఆలోచన ఇకపై లేదని సల్మాన్ ఖాన్ మరోసారి చెప్పకనే చెప్పాడు. సల్మాన్ ఖాన్ కెరీర్లో పలువురితో ఎఫైర్స్ నడిపారు. ఈ లిస్ట్ లో ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజ్లానీ ఇలా చాలా మందే ఉన్నారు. సంగీత బిజ్లానీతో ఆయన వివాహం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి ఆగిపోయింది. ఈ కండల వీరుడు ప్రేమ బంధాలను పెళ్లి వరకు తీసుకెళ్లలేదు.

Salman Khan: హీరో సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ 57 ఏళ్ల హీరో పెళ్లి చేసుకోలేదు. సల్మాన్ వివాహం ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. సల్మాన్ ఖాన్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభాస్ లాంటి హీరోలు పెళ్లి చేసుకోవడం లేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడని అడిగితే… సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత అని ప్రభాస్ చెప్పాడు. గత రెండు దశాబ్దాలుగా సల్మాన్ పెళ్లిపై పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.
పెళ్లిపై సల్మాన్ ఆలోచన ఏంటి? తాజాగా ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. అనూహ్యంగా ఓ హాలీవుడ్ రిపోర్టర్ సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంటారా? అని అడిగింది. ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ని హాలీవుడ్ లేడీ రిపోర్టర్… నేను మీ సినిమాలు చూసి ప్రేమలో పడ్డాను. ఈ ప్రశ్న అడిగేందుకు హాలీవుడ్ నుండి వచ్చాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగింది. నువ్వు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నావా? అని సల్మాన్ అన్నారు. కాదు నేను సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా? అని ఆ లేడీ రిపోర్టర్ మరలా అడిగారు.
నువ్వు ఓ 20 ఏళ్ల క్రితం నన్ను కలవాల్సిందని సల్మాన్ సమాధానం చెప్పాడు. పెళ్లి చేసుకునే ఆలోచన ఇకపై లేదని సల్మాన్ ఖాన్ మరోసారి చెప్పకనే చెప్పాడు. సల్మాన్ ఖాన్ కెరీర్లో పలువురితో ఎఫైర్స్ నడిపారు. ఈ లిస్ట్ లో ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజ్లానీ ఇలా చాలా మందే ఉన్నారు. సంగీత బిజ్లానీతో ఆయన వివాహం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి ఆగిపోయింది. ఈ కండల వీరుడు ప్రేమ బంధాలను పెళ్లి వరకు తీసుకెళ్లలేదు.
మరోవైపు సల్మాన్ ఖాన్ కెరీర్ కొంచెం డల్ అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సల్మాన్ ఖాన్ రేంజ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. తమిళ చిత్రం వీరమ్ రీమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అంచనాలు అందుకోలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ కీలక రోల్ చేశారు. రామ్ చరణ్ ఓ సాంగ్ లో తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ఆయన టైగర్ 3 మూవీ చేస్తున్నారు.
https://twitter.com/Freak4Salman/status/1662189645529235456