Pawan Kalyan Varahi- YCP: వాహనాన్ని చూసి ఓ ప్రభుత్వం భయపడుతోంది. ఆ వాహనం రంగు చూసి బెదురుతోంది. ఏపీలోకి అడుగుపెడితే అడ్డుకుంటామని ప్రకటిస్తోంది. మంత్రివర్గమే రంగంలోకి దిగి ప్రకటనలు చేస్తోంది. అనుమతులున్నా సరే మరోసారి పరీక్షిస్తామంటోంది. ఇంతలా ఓ ప్రభుత్వాన్ని భయపెడుతున్న ఆ వాహనం ఏంటి ? దాని కథేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Pawan Kalyan Varahi
వారాహి.. జనసేనాని పవన కళ్యాణ్ ప్రచారరథం. ఏపీ ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. వారాహి వాహనం ట్రైలర్ ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వానికి నిద్రపట్టడంలేదు. వారాహి పర్మిట్ల గురించి, వాహనం రంగు గురించి ఏపీ మంత్రివర్గం అవాకులు చవాకులు పేలుతోంది. ఒక వాహనం ప్రభుత్వాన్ని ఇంతలా భయపెట్టడం ఇదే మొదటిసారి అనుకుంటా. చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.
వారాహి వాహనం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ వాహనం రవాణ శాఖ అనుమతితో దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. దాని ప్రత్యేకంగా రాష్ట్రానికో అనుమతి అవసరం లేదు. వారాహికి తెలంగాణ రవాణ శాఖ జాతీయ పర్మిట్ ఇచ్చింది. ఇంతకంటే ఓ వాహనానికి ఇంకేం కావాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. `వాహనాన్ని ఏపీలో తిరగనివ్వం. వారాహి రంగు ఆర్మీ వాహన రంగును పోలి ఉంది `అంటూ ఏపీ మంత్రులు మీడియాకెక్కి కామెంట్ చేశారు.

Pawan Kalyan Varahi- YCP
ఓ వాహనం గురించి ఏపీ మంత్రివర్గం ఇంతాల కలవరపడటానికి కారణం ఆ వాహనానికి ఉన్న ప్రత్యేకతలే. వారాహి ఠీవిగా కదిలివస్తుంటే ఓ యుద్ధ ట్యాంకర్ వస్తున్నంత గాంభీర్యంతో కనిపిస్తుంది. వారాహి అన్న పేరులోనే ఏదో తెలియని ఎనర్జీ ఉంది. అందుకే వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద నిద్రలేకుండాపోయింది. గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారరథాన్నితయారు చేయించుకున్నప్పటికీ.. వారాహిని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారని చెప్పవచ్చు. ఇక వారాహి పై పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వైసీపీ ముందే ఊహించుకుందో ఏమో అందుకే ఇంతలా భయపడుతోంది.
వారాహి తొలిసారి ఏపీలోకి ప్రవేశించింది. జాతీయ స్థాయి పర్మిట్ తో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారాహి రంగు కూడ ఆర్మీవాహనం రంగు కాదని తేల్చిచెప్పింది. వైసీపీ ఆరోపణలన్నింటికీ తెలంగాణ రవాణ శాఖ స్పతనిచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం అన్నింటినీ నిశితంగా పరిశీలించి చూస్తామని చెబుతోంది. రవాణ శాఖ సూచనల మేరకు మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఈ విధంగా వారాహిని అడ్డుకోవాలని చూస్తోంది. ఆచరణ సాధ్యం కాని సూచనలు చేస్తారు. ఆ సూచనల మేరకు మార్పులు చేయకపోతే.. వారాహిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. వైసీపీ వ్యవహారశైలి చూస్తే ఎందుకింతలా భయపడుతోందో అర్థం కాదు. మొత్తం సీట్లు గెలుస్తామని చెప్పుకుంటూ ఓ వాహనాన్ని చూసి ఇంతలా భయపడతారా ? అని చర్చ జరుగుతోంది. నిజంగా ప్రభుత్వానికి భయం లేకుంటే వారాహి పై అంత శ్రద్ధ దేనికి.