Congress Party Maha Padayathra: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీపై పడిన అప్రదిష్టను తొలగించుకుని విజయవంతంగా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇందుకు గాను దేశవ్యాప్తంగా మహాపాదయాత్ర చేయాలని సంకల్పిస్తోంది. ఇందుకు రోడ్ మ్యాప్ ను కూడా తయారు చేస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్విఘ్నంగా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర కావాలని చూస్తోంది. దీనికి గాను ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

congress party
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహించే చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మేథోమథనంలో భాగంగా పాదయాత్ర చేయాలని సంకల్పించింది. దీనికి కోర్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో పాదయాత్రలో నిరుద్యోగ సమస్యను ప్రస్తావించి ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా పోయిన పరువు తెచ్చుకోవాలని పార్టీ నిర్ణయించింది.
Also Read: Andrew Symonds Passed Away: సైమండ్స్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన ఏంటో తెలుసా?
ఏడాది పాటు నిర్వహించే పాదయాత్రలో పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్ గా దిగ్విజయ్ సింగ్ వ్యవహరించనున్నట్లు సమాచారం. సీనియర్లు కూడా దీనికి రావాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పార్టీనేతల్లో లోతైన చర్చ జరుగుతోంది. పాదయాత్రను ఎలా నిర్వహించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.
మహాపాదయాత్ర చేసే క్రమంలో ముఖ్యమైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను తిరుగుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో పార్టీ ప్రతిష్టను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.

Congress Party
చింతన్ శిబిర్ లో ఇంకా ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. కానీ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మేల్కోకపోతే ఇక ఎప్పటికి కూడా ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ విజయం కోసం అందరు శ్రమించాలని సూచిస్తున్నారు. యువతకు పెద్దపీట వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Adani: నాట్ ఇంట్రెస్ట్: రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్న అదాని..