CM KCR: లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందా? కేసీఆర్ లో భయం ఎందుకు!?

ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఉన్న సీట్లతో సమానంగా రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి అంటున్నారు.

  • Written By: DRS
  • Published On:
CM KCR: లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందా? కేసీఆర్ లో భయం ఎందుకు!?

CM KCR: లోక్‌ సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా.. 2026 తర్వాత దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గబోతున్నాయా.. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, దక్షిణాదిపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గతంలో అనేక పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ అంశాన్ని కేటీఆర్‌ లేవనెత్తారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ జరుగుతుందని, దీంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

దక్షిణాది సీట్లు మొత్తం యూపీ, బీహార్‌ సీట్లతో సమానం..
ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఉన్న సీట్లతో సమానంగా రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి అంటున్నారు. ఇలా రూపొందిన ఓ మ్యాప్‌ ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో పంచుకుని దక్షిణాది రాష్ట్రాలకు జరుగబోతున్న అన్యాయంపై ప్రశ్నించారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేశాయన్నారు. అయితే ఇప్పుడు అదే దక్షిణాది రాష్ట్రాల అన్యాయానికి కారణమవుతుందని కేటీఆర్‌ పేర్కొంటున్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్‌ వల్ల జనాభా ప్రాతిపదికన తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటాయని పేర్కొన్నారు.

జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు లబ్ధి..
మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిజానికి ఇలాంటివి జరిగితే దేశంలో దక్షిణాది సెంటిమెంట్‌ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే అన్యాయం చేయబోమని కేంద్ర పెద్దలు అనధికారికంగా చెబుతున్నారు. కానీ ఏం చేస్తారన్నది డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభమైతేనే తెలుస్తుంది.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు