Delhi Liquor Scam Case: కవితను అరెస్టు చేస్తారా..? మళ్లీ ఈ నోటీసుల కథ ఏంటి?
అయితే కవితకు తాజాగా ఈడి అధికారులు నోటీసులు పంపించడం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇటీవల ఈడి అధికారుల ఎదుట అప్రూవర్ గా మారిపోతున్నట్టు అంగీకరించారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో కోరారు. ప్రస్తుతం కవిత అస్సాం పర్యటనలో ఉన్నారు. ఇటీవల ఆమె కామాఖ్య దేవిని దర్శించుకున్నారు. అక్కడి సంప్రదాయ వంటకం మోమో లను తింటూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈడి పంపిన నోటీసులు ఆమెకు అందాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అయితే గతంలో ఆమెను ఈడి రెండు సార్లు విచారణకు పిలిచింది. మొదటిసారి విచారణకు తాను రాలేనని పేర్కొన్న కవిత, కొద్ది రోజులు కడుగు తర్వాత విచారణకు హాజరైంది. ఆ తర్వాత మరుసటి విచారణకు కూడా ఆమె ఐఫోన్లతో హాజరైంది. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన విచారణతో కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరకు అరెస్టు వంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో భారత రాష్ట్ర సమితి నేతలు ఊపిరి పీల్చుచుకున్నారు. అయితే ఆమెను రెండుసార్లు విచారించినప్పుడు భారత రాష్ట్ర సమితి కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.
అయితే కవితకు తాజాగా ఈడి అధికారులు నోటీసులు పంపించడం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇటీవల ఈడి అధికారుల ఎదుట అప్రూవర్ గా మారిపోతున్నట్టు అంగీకరించారు. వీడి అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఈ సందర్భంగా ఈడి అధికారులు అతడి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ లాబీలో తాము బలంగా పనిచేసామని, లిక్కర్ కార్టెల్స్ దక్కించుకునేందుకు లంచాలు ఇచ్చామని ఆయన ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో బుచ్చిబాబు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఈడి అధికారులు విచారణ సాగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ గ్రూపుకు సంబంధించి పలు కీలకమైన ఆధారాలను వీడి అధికారులు సంపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.
బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా అప్రమత్తమయ్యారు. తను కూడా అప్రూవర్ గా మారిపోయారు. సౌత్ లాబీలో తాము ఎక్కడ పెట్టుబడి పెట్టింది? ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది.. అనే విషయాలను ఆయన ఈడి అధికారులకు పూస గుచ్చినట్టు వివరించారు. అతడి స్టేట్మెంట్లు కూడా ఈడి అధికారులు రికార్డ్ చేసుకున్నారు. ఇక కవితకు బినామిగా వ్యవహరించినట్టు చెబుతున్న అరుణ్ రామచంద్ర కూడా ఈడి అధికారుల ఎదుట అప్రూవర్ గా మారిపోయారు. కవిత సూచనలతోనే తాను బినామీగా మారానని ఈడి అధికారుల ఎదుట ఆయన అంగీకరించినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు గతంలో అరుణ్ రామచంద్ర అప్రూవర్ గా మారారు. వాంగ్మూలం కూడా ఇచ్చారు. తర్వాత మనసు మార్చుకొని తనను బలవంతంగా ఇబ్బంది పెట్టారని కోర్టు ఎదుట వాపోయాడు. తర్వాత ఇప్పుడు అప్రూవర్ గా మారాడు. పలు కీలక విషయాలు వెల్లడించడంతో వీడి అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. అయితే కవిత విచారణకు హాజరవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఈడి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్నది.
