BJP – TDP : బీజేపీ ఓట్లు టీడీపీకి పడుతాయా? నిజమెంత?
అలాంటి పార్టీతో అంటకాగితే టీడీపీ ని కూడా దూరం పెడతారు అని అంటున్నారు. ఏపీ లో జనసేన, బీజేపీ ని టీడీపీ తో కలపడానికి చూస్తోంది. ఆ పార్టీ లోకి వెళ్ళిన మాజీ టీడీపీ తమ్ముళ్ళు కూడా అదే పని లో ఉన్నారు.

BJP – TDP : పొత్తు అనేది ఉభయతారకంగా ఉండాలి. రెండు పార్టీల ఓటు బ్యాంక్ సర్దుబాటు కావాలి.బదలాయింపు సక్రమంగా జరగాలి. లేకుంటే మాత్రం పొత్తు ఎట్టి పరిస్థితుల్లో వర్కవుట్ కాదు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు విషయంలో అటువంటి ఆలోచనలే బయటకు వస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య సుదీర్ఘ కాలం పొత్తు నడిచింది. చాలా సందర్భాల్లో ఇది వర్కవుట్ అయ్యింది కూడా. కానీ ఉభయులు వ్యవహరించిన తీరుతో కొన్నిసార్లు దారుణ ఫలితాలు వెలుగుచూశాయి. 2004, 2009 ఎన్నికల్లో పొత్తు ఉన్నా రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగలేదు. దీంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
సుదీర్ఘ కాలం తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో వీరి కలయిక పొలిటికల్ హీట్ ను పెంచింది. భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా కూడా మీటింగ్‌కి విపరీతమైన ప్రచారం ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీ తో పొత్తుల కు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఆయన వ్యూహాలు ఏంటో తెలియడంలేదు కానీ వెళ్ళి వెళ్ళి కమలం పార్టీ ఉచ్చులో చిక్కుకున్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు పార్టీల కలయికతో ప్రయోజనం ఎవరికి అంటే రెండు పార్టీల కు నష్టమే అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇక చంద్రబాబు కు అది ఇంకా పెద్ద నష్టం అని కూడా అంటున్నారు.
తెలంగాణా లో టీడీపీ బీజేపీ ని అధికారం లోకి తెస్తుందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. గతంలో మాదిరిగా తెలంగాణలో టీడీపీకి బలం లేదన్నది వాస్తవం. తెలుగుదేశం బలమంతా బీఆర్ఎస్ లోకి షిఫ్ట్ అయ్యింది. 2014 తరువాత టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అటు తరువాత జరిగిన రెండు జీ హెచ్ ఎం సీ ఎన్నికలు, మరో రెండు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఏమంత బలం చూపలేకపోయింది. వాస్తవానికి తెలంగాణ లో టీడీపీ ని గెలిచే పార్టీగా ఎవరూ చూడడంలేదు అంతే కాదు ఉనికి ని చాటుకునే పార్టీగానే చూస్తున్నారు. టీడీపీ పై అభిమానం ఉన్నవారు సైతం ఓడిపోయే పార్టీకి ఎందుకు ఓటు వేయడం అని ఆలోచిస్తున్నారు.
ఏపీ లో బీజేపీ వల్ల టీడీపీకి ప్రయోజనం ఏమైనా ఉందంటే అదీ లేదు. అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకుని వెళ్తే జనాల్లో వ్యతిరేకత బాగా ఎక్కువ అవుతుందని అది చివరి కి టీడీపీ పుట్టె ముంచుతుంది అని అంటున్నారు. బీజేపీ మీద ఏపీ జనాలు గుర్రు మీద ఉన్నారు. విభజన హమీలు తీర్చలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఏపీ ని ఏ విధంగానూ ఆదుకోలేదని వారు మండిపడుతున్నారు.పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టడం మీద అయితే మండిపోతున్నారు. అలాంటి పార్టీతో అంటకాగితే టీడీపీ ని కూడా దూరం పెడతారు అని అంటున్నారు. ఏపీ లో జనసేన, బీజేపీ ని టీడీపీ తో కలపడానికి చూస్తోంది. ఆ పార్టీ లోకి వెళ్ళిన మాజీ టీడీపీ తమ్ముళ్ళు కూడా అదే పని లో ఉన్నారు. ఒక వేళ పొత్తు కుదిరినా ఓట్లు, సీట్లు సర్దుబాటయ్యే చాన్సే లేదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.
