MP Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు?
. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే హత్య ఎందుకు జరిగిందో తెలిపిపోతుందని కూడా సీబీఐ చెప్పడం లేదు. ఈ ఉత్కంఠతకు తెరపడాలి అంటే సీబీఐ నోరు విప్పాలి. లేకపోతే విచారణ మరికొద్ది రోజులు, సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

MP Avinash Reddy : వివేకా హత్య కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని సీబీఐ చెబుతున్నా, అసలెందుకు హత్య జరిగింది అనే విషయాన్ని ఇప్పటికీ బహిరంగ పర్చలేదు. వాస్తవాలు ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేయడం లేదు. ఊహాజనిత ఆరోపణల మీదనే ఆధారపడి విచారణ జరుపుతుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం విచారణ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దాంతో ఆయనను సీబీఐ ఎందుకు టార్గెట్ చేస్తుందనే చర్చ జరుగుతుంది.
వివేకా హత్య జరిగి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది. అసలు నిందితులు ఎవరనేది మాత్రం తేలలేదు. సీబీఐ విచారణకు ఆదేశించినా, ఫలితం మాత్రం కనబడటం లేదు. హత్య చాలా పకడ్బందీగా సాక్ష్యాలు కూడా దొరకకుండా చేశారన్నది తేలిపోయింది. పోలీసులు, సీబీఐ అధికారులు విచారణను మొదట్లో నత్తనడకన కొనసాగించారు. నిందితులు తప్పించుకునేందుకు, సాక్షులు దొరక్కుండా ఉండేందుకు ఈ కాలం ఉపయోగిపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా, వివేకా హత్య కేసు విచారణ తెలంగాణా కోర్టుకు బదిలీ అయిన వేగం పెరిగింది. నిందితులుగా ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరీలను అదుపులో తీసుకుంది. వీరిలో దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాత మిగతా ఇద్దరి అరెస్టులు జరిగాయి. వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. వీరందరిని వేర్వేరుగా సీబీఐ విచారిస్తున్నది. సరైన ఆధారం దొరకకపోగా, పొంతలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తుంది. పైగా విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఆయన తల్లికి బాగోలేని కారణాన్నికోర్టుకు చూపుతూ అరెస్టును నిలువరించుకుంటూ వస్తున్నారు. మరోవైపు తనకే పాపం తెలియదని అంటున్నారు. వివేకా కూతరు సునీత, కుటుంబ వ్యవహారాల దిశగా ఎందుకు విచారించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వివేకా హత్య కేసు విచారణ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనబడటం లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే హత్య ఎందుకు జరిగిందో తెలిపిపోతుందని కూడా సీబీఐ చెప్పడం లేదు. ఈ ఉత్కంఠతకు తెరపడాలి అంటే సీబీఐ నోరు విప్పాలి. లేకపోతే విచారణ మరికొద్ది రోజులు, సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.
