
Ram Charan- Kiara Advani
Ram Charan- Kiara Advani: సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో మరియు హీరోయిన్ క్లోజ్ గా ఉంటే వాళ్ళ మధ్య లేనిపోని అఫైర్స్ పెట్టేస్తుంటారు మన గాసిప్ రాయుళ్లు.అందులో పెళ్ళై పదేళ్లు దాటినా రామ్ చరణ్ కూడా అతీతం ఏమి కాదు.’వినయ విధేయ రామ’ సినిమా సమయం లో రామ్ చరణ్ – కియారా అద్వానీ మంచి స్నేహితులయ్యారు.వీళ్లిద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవడం, తిట్టుకోవడం మరియు కొట్టుకోవడం వంటి చిలిపి చేష్టలు చూసి కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది అనే రూమర్స్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి.
అప్పట్లో వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండడం పై ఉపాసన కూడా ఫైర్ అయ్యినట్టు వార్తలు వచ్చాయి.అయితే వీళ్లిద్దరు కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంతకు మించి ఇంకేమి లేదు అని రీసెంట్ కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ని వివాహం ఆడినప్పుడు అర్థం అయ్యింది.అయితే నిన్న ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో రామ్ చరణ్ కియారా అద్వానీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ జర్నలిస్ట్ ‘రాజ్ దీప్ సర్దేశాయ్’ రామ్ చరణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇప్పటి వరకు మీరు ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పని చేసారు..కానీ వారిలో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ‘ అని అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘కియారా అద్వానీ’ అని చెప్పేస్తాడు.తనతో ఎంతో మంచి స్నేహం ఉందని, అంత క్లోజ్ గా నేను ఏ హీరోయిన్ తో ఇప్పటి వరకు ఉండలేదు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

Ram Charan- Kiara Advani
దీనితో కియారా అద్వానీ మీద ఇంకా మనసు పోలేదా అని ఫ్యాన్స్ రామ్ చరణ్ పై సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా లో.ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి మదరికీ తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈ నెల 27 వ తారీఖున విడుదల కాబోతున్నాయి.