Jagan Vs Tollywood: జగన్ అంటే టాలీవుడ్ ఎందుకు భయపడుతోంది?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు, నటీనటులు ఎక్కువగా మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు.

  • Written By: Suresh
  • Published On:
Jagan Vs Tollywood: జగన్ అంటే టాలీవుడ్ ఎందుకు భయపడుతోంది?

Jagan Vs Tollywood: ఏ ఇండస్ట్రీ అయినా ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది.ఆ లిస్ట్ లోకే సినిమా ఇండస్ట్రీ కూడా వస్తుంది.. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎంత కష్టపడ్డా కూడా థియేటర్లలో టికెట్ రేట్లు సరిగ్గా లేకపోతే సినిమాలు ఆడడం కష్టం. అందుకే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి సినిమాలు తీస్తుంటారు మేకర్స్. ప్రభుత్వం గురించి కాస్త నెగటివ్ గా మాట్లాడాలన్నా భయపడుతుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ సీఎం జగన్ కు భయపడుతుందనే టాక్ కూడా ఉంది. మరి దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు, నటీనటులు ఎక్కువగా మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉంటూ.. ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సందర్బంలో వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన సపోర్ట్ చేసే ఆస్కారం కూడా ఉండదు. మా ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మంచు కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉందనే టాక్ వినిపించింది. అందుకే మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యారని టాక్ వచ్చింది. ఇలా ఎలాంటి వ్యవహారాల్లో అయినా ప్రభుత్వ అండ తప్పనిసరి కాబట్టి.. టాలీవుడ్ జగన్ సర్కార్ కు భయపడుతుంది అని సినీ విశ్లేషకుల వాదన.

గతంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీలో పెద్ద దుమారమే రేగింది. అప్పుడు ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. కరోనా సమయంలో టికెట్ రేట్లు పూర్తిగా తగ్గించారు. దీంతో సినిమా ఇండస్ట్రీకి కష్టాలు ఎదురయ్యాయి. సినిమా పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు, పెద్దలు ఇబ్బంది పడ్డారు. దీంతో స్టార్ హీరోలు వెళ్లి ఏపీ సీఎంను కలిశారు. టికెట్ రేటును పెంచడం, తగ్గించడం ప్రభుత్వ పరిధిలో ఉండడంతో అసలు ప్రభుత్వాలకు సంబంధించిన ఎలాంటి కామెంట్లు చేయరట.

కొన్ని సార్లు సినిమాలను నిర్మించడానికి బ్లాక్ మనీ కూడా వాడుతుంటారు అనే వాదన ఉంది. కాబట్టి ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెడితే సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది జరగుతుంది. అందుకే ప్రభుత్వం అంటే భయపడుతారు అని టాక్. కానీ ఇందులో నిజం ఎంతనేది సినిమా పెద్దలు చెబితే గానీ తెలుసుకోలేం.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు