Ravikrishna : 7/g బృందావన్ కాలనీ హీరో సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

ఇక దీంతో మొత్తానికి ఫ్లాప్ ల వల్ల కాదు గాని ఇన్ని సంవత్సరాలైనా సరైన కథ తన దగ్గరికి రాకపోవడం వల్లే ఈ హీరో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని తెలుస్తొంది. మరి ఇప్పటికైనా ఎవరైనా దర్శకుడు మంచి కథతో వెళ్లి రవికృష్ణ ని మెప్పించి మరో మంచి లవ్ స్టోరీ తీస్తారేమో వేచి చూడాలి.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Ravikrishna : 7/g బృందావన్ కాలనీ హీరో సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Ravikrishna : కొంతమంది హీరోలు తమ మొదటి సినిమా ఫ్లాప్ అయినా కానీ స్టార్ హీరోలు అయిపోతారు. మరి కొంతమంది హీరోలు మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కానీ కనుమరుగైపోతూ ఉంటాడు. ఈ రెండిటికి కారణాలు ఏవో మనకు తెలియదు కానీ మొత్తానికి హీరో రవి కృష్ణ మాత్రం రెండో తావకి చెందుతారు.

తెలుగులో అలానే తమిళంలో ఫేమస్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న గేయం రత్నం కొడుకు రవికృష్ణ. ఇక అంత పెద్ద నిర్మాత కొడుకు కావడంతో ఈయన తప్పకుండా మంచి హీరోగా నిలబడతారు అని అనుకున్నారు అందరూ. దానికి తగ్గట్టుగానే రవికృష్ణ మొదటి సినిమా 7/g బృందావన్ కాలనీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సోనియా అగర్వాల్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో అలానే తమిళంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి తీసుకొచ్చింది. ఇక ఆ చిత్రం అంతటి ఘన విజయం సాధించడంతో ఇక రవి కృష్ణ కి తిరిగే లేదు అనుకున్నారు అందరూ. కానీ ఆ తరువాత మాత్రం అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. తన మొదటి సినిమానే తనకు శాపంగా మిగిలింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రం కన్నా కూడా మంచి లవ్ స్టోరీ తో తన తదుపరి ప్రాజెక్టులు ఉంటాయి అని అనుకున్నారు అందరూ. కాగా 7/g బృందావన్ కాలనీ అంచనాలు అందుకోలేక రవికృష్ణ నుంచి వచ్చిన తదుపరి ప్రాజెక్టులు అన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి.దాంతో హీరోగా సినిమాలు తగ్గాయి.. కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. రవి కృష్ణ చివరగా నటించిన సినిమా తమిళ్ లో 2011లో విడుదల కాగా దాదాపు పుష్కర కాలం పాటు మళ్ళీ మొహానికి మేకప్ వేసుకోలేదు.

అయితే ప్రస్తుతం 7/జి బృందావన్ కాలనీ సెప్టెంబర్ 22న రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీ రిలీస్ సంబరాలలో పాల్గొన్నారు రవికృష్ణ. ఇక ఆ ఈవెంట్ లో కూడా కొంతమంది అసలు ఎందుకు మీరు ఎన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు అని అడిగారు. ఇక దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు ఈ హీరో. ‘చాలామంది నేను బృందావన్ కాలనీ వంటి సినిమా తీయడం లేదని ఆ తర్వాత అసలు సినిమాల్లోనే కనిపించలేదని అనుకుంటున్నారు. కానీ ఈ 20ఈ ఏళ్ల కాలంలో దాదాపు 600 నుంచి 700 వరకు కథలు విన్నాను. నా వరకు కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. స్క్రిప్ట్ లెవెల్ లో బాగా లేని సినిమాలు ఎలా ప్రేక్షకులను మెప్పించగలవు అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందుకు రాబోతున్నాను’ అంటూ రవికుమార్ తెలియజేశారు.

ఇక దీంతో మొత్తానికి ఫ్లాప్ ల వల్ల కాదు గాని ఇన్ని సంవత్సరాలైనా సరైన కథ తన దగ్గరికి రాకపోవడం వల్లే ఈ హీరో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని తెలుస్తొంది. మరి ఇప్పటికైనా ఎవరైనా దర్శకుడు మంచి కథతో వెళ్లి రవికృష్ణ ని మెప్పించి మరో మంచి లవ్ స్టోరీ తీస్తారేమో వేచి చూడాలి.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు