Ukrain Russia: గడ్డ కట్టించే చలిలోనూ సైనిక బలగాలు.. భారీగా యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాల ప్రవేశం.. మరోసారి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయనుందా..? అనే వాతావరణం కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య పోరు ఈనాటిది కాదు. కానీ తాజాగా మరోసారి రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పై విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ పై పోరు సలపాలన్న రష్యా ప్రయత్నంపై అమెరికా అడ్డుకుంటోంది. ఉక్రెయిన్ కు అవసరమైన సాయం చేయడానికి ముందుకు వస్తోంది. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో కలిసున్న భూభాగం. స్వతంత్రంగా ఏర్పడిన ఉక్రెయిన్ కు ఇప్పుడు అమెరికా అండగా ఉంటాలనుకుంటోంది. ఎందుకు..? అసలు రష్యా సరిహద్దులోనే ఉండే ఉక్రెయిన్ పై రష్యాకు ఎందుకు కోపం వస్తోంది..?
ఉక్రెయిన్ పై పోరుతో పశ్చిమ దేశాలకు దడ పుట్టించాలని పుతిన్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు యూరప్లో విస్తరిస్తేందుకు అమెరికాకు చెందిన ‘నాటో’ కూటమి చేస్తున్న ప్రయత్నాలతో రష్యాకు మింగుడుపడడం లేదు. అంతేకాకుండా నాటో కూటమి దేశాలు రష్యా సరిహద్దుల్లో ఉండంతో పాటు ఆ దేశాలు ఆయుధాలు మోహరించడంతో తమకు ముప్పుగానే భావిస్తున్నారు పుతిన్. ఇటీవల రెండు సంఘటనలు ఈ పరిస్థితి రావడానికి కారణంగా చెబుతున్నారు. తూర్పు ఉక్రెయిన్లు టర్కీ డ్రోన్లను రష్యా మద్దతు దళాలలపై ఉపయోగించాయి. మరొకటి నల్ల సముద్రంలో పశ్చిమ దేశాలు తమ సైనిక బలగాలు మోహరించడం.
ఒకప్పుడు ఉక్రెయిన్ రష్యాలో భాగంగా ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. ఉక్రెయిన్ రష్యాతో విడిపోయినప్పటికి అనేక రకాల సంబంధాలు నెరుపుతూనే ఉంది. అంతేకాకుండా ఉక్రెయిన్లో ఇప్పటికీ రష్యన్ భాషనే ప్రధానంగా చూస్తారు. అంతేకాకుండా తూర్పు ఉక్రెయిన్ రష్యాకు మద్దతుగా ఉంటూ వస్తోంది. అయితే ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గుచూపుతుండడం రష్యాకు నచ్చలేదు. పశ్చిమ దేశాల్లో ప్రధానంగా ఉన్న అమెరికాతో పాటు నాటో దేశాలతో ఉక్రెయిన్ సన్నిహితంగా ఉండడంపై ఇప్పటికీ రష్యా మండిపడతూనే ఉంటుంది.
ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని, అలాగే ఉక్రెయిన్ భూభాగంలో నాటో కార్యకాలపాలు ఉండకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వాదనం. ఎందుకంటే అమెరికా ఉక్రెయిన్ ను వేదికగా చేసుకొని రష్యాపై వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందని ఆయన అంటున్నారు. రష్యాకు అనుకూలంగా ఉండే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ 2014 ఫిబ్రవరి 22న తొలగించడబడ్డాడు. అయితే తొలగింపు వెనుక అమెరికా హస్తం ఉందని పుతిన్ భావించారు. దీంతో అదే సంవత్సరంలో రష్యా క్రైమియా దేశాన్ని ఆక్రమించింది. ఆ తరువాత తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలపై కూడా రష్యా మద్దతుదారులు ఆధిపత్యాన్ని చెలాయించారు.
రష్యా దూకుడుతో యూరోపియన్ యూనియన్లకు ముప్పు ఉందని నాటో దేశాల వాదన. యూరప్లోని తమ భాగస్వామి, మిత్ర దేశాలకు కట్టుబడి ఉంటామంటోంది అమెరికా. ఇందులో భాగంగా నాటో కూటమి తూర్పు అంతటా విస్తరించి బలం పెంచుకోవాలని చూస్తోంది. ఉక్రెయిన్లో అడుగుపెట్టి రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని అమెరికా అసలు లక్ష్యం. ఇందులో భాగంగా ఉక్రెయిన్లో ఇప్పటికే బ్రిటన్ నేవల్ బేస్ ల నిర్మాణానికి సాయం చేసింది. అమెరికా రక్షణ దళాలను పంపిస్తోంది. అయితే ఇవన్నీ ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం అని నాటో దేశాలు చెబుతున్నా పశ్చిమ దేశాల సొంత ప్రయోజనాలకేనని అర్థమవుతోంది. రష్యాకు ఇది మింగుడు పడడంలేదు. దీంతో రష్యా తన చుట్టుపక్క దేశాలను అమెరికా తన గుప్పిట్లో పెట్టుకోవడంపై వ్యతిరేకిస్తోంది. మొత్తంగా అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ఉక్రెయిన్ వేదక కానుంది.