Rajamouli- Allu Arjun: అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమా తీయడం లేదు.. కారణం ఏంటి?
రామ్ చరణ్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్, మగధీర. జూనియర్ ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేశారు.

Rajamouli- Allu Arjun: సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం.. బ్లాక్ బస్టర్ హిట్, థియేటర్ లో ఫుల్ కలెక్షన్లు ఆయన సొంతం. ఈయనతో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు సైతం లైన్ కడుతుంటారు. ఆయనే దర్శక ధీరుడు రాజమౌళి.ఈ స్టార్ డైరెక్టర్ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేశారు కానీ అల్లు అర్జున్ తో ఇప్పటికీ సినిమా చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, నాని, మహేష్ బాబుతో సినిమాలు చేశారు. చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ తో మాత్రం సినిమా రాలేదు. దీనికి కారణం ఏంటి అని ఇద్దరి అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.
రామ్ చరణ్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్, మగధీర. జూనియర్ ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేశారు. సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ,RRR. ఇటు నానితో ఈగ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు రాజమౌళి. అదే రేంజ్ లో నానికి కూడా పేరు సంపాదించి పెట్టారు. మహేష్ బాబుతో ఇప్పుడు సినిమాకు రెడీ అయ్యారు. స్టార్ హీరోలు, కమెడియన్ లతో సినిమా చేసిన రాజమౌళి అల్లు అర్జున్ తో మాత్రం సినిమా తీయలేదు.
మగధీర సినిమా టైంలో అల్లు అరవింద్ తో కొన్ని విభేదాలు రాజమౌళికి వచ్చాయని టాక్ వినిపిస్తుంది. మగధీర సినిమాకు అల్లు అరవింద్ ప్రోడ్యూసర్. అయితే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయిందట. రాజమౌళి సినిమా అంటే మినిమమ్ రేంజ్ ఉంటుంది. అంతే కాదు ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి.. ఈ ఖర్చు విషయంలోనే అల్లు అరవింద్ కు, జక్కన్నకు మనస్పర్తలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఇప్పటికి అల్లు అర్జున్ తో సినిమా చేయలేదట రాజమౌళి.
రాజమౌళి సినిమా తీస్తే.. చాలా పగడ్భందీగా.. చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కారని తెలిసిందే. కానీ మగధీర సినిమా చేస్తున్నప్పుడు ఇంతలా క్రేజ్ లేకపోవడంతో అల్లు అరవింద్ భయపడి ఉంటారు. దీంతోనే బడ్జెట్ విషయంలో మనస్ఫర్తలు వచ్చి ఉండాలి అనుకుంటున్నారు కొందరు. ఇదే కారణం అయితే తొందరలోనే అవి తొలిగిపోయి వెంటనే అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అని అందరు కోరుకుంటున్నారు. ఇక రాజమౌళి మహేష్ తో సినిమా అనుకున్నారు. ఆ సినిమా కచ్చితంగా మరో రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ లోపే బన్నీతో ఒక సినిమాకు సైన్ చేయాలి అని ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు.
