Telangana Elections 2023: తెలంగాణపైనే రాహుల్ గాంధీ ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టినట్టు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళిని చూస్తుంటే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రా రాష్ట్రాలను విభజించుకుని ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ ఈరోజు విడుదల కానుంది. దీంతో నామినేషన్ల పర్వం కూడా మొదలవుతుంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో అన్ని పార్టీలు ఇక పూర్తిస్థాయిలో ప్రచారరంగంలోకి దిగనున్నాయి. ఈమేరకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ను అనుసరిస్తోంది. ఇక బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపిక దశలోనే ఉంది. అగ్రనాయకులతో నాలుగు సభలు నిర్వహిచినప్పటికీ రాష్ట్రస్థాయి నేతల ప్రచారం అంతం మాత్రంగానే సాగుతోంది. అయితే కాంగ్రెస్‌మాత్రం తెలంగాణపైనే ఎక్కువ వృష్టిపెట్టింది. అగ్రనేత రాహుల్‌గాంధీతో ఎక్కువ ప్రచారం చేయించేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందించింది. రాహుల్ కూడా మిగత నాలుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణపైనే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు.
ఉత్తరాన చెల్లి.. దక్షిణాన అన్న..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళిని చూస్తుంటే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రా రాష్ట్రాలను విభజించుకుని ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం బాధ్యతలు ప్రియాంక, రాజస్థాన్‌తోపాటు, దక్షిణాది రాష్ట్రం తెలంగాణ బాధ్యతలను రాహుల్‌గాంధీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రియాంక తెలంగాణ ప్రచారానికి దూరంగా ఉంటుందని అంటున్నారు. ఆమె మధ్యప్రదేశ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక రాహుల్ రాజస్థాన్, తెలంగాణలో ఎక్కువగా పర్యటిస్తున్నారు.
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో..
ఆరు నెలల క్రితం తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫలితాల తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. దీంతో కర్ణాటక మంత్రమే టీకాంగ్రెస్ నాయకులు జపిస్తున్నారు. కర్ణాటక సక్సెస్ ఫార్ములానే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక నాయకులను కూడా ప్రచారంలోకి దింపుతున్నారు. ఇక, కర్ణాటకలో విజయం సాధించినందున మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో పాగా వేయడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 30కిపైగా సీట్లు కచ్చితంగా గెలుస్తామని అంచనా వేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి మరో 10 వరకు లోక్‌సభ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కర్ణాటకతోపాటు తెలంగాణలో అధికారంలోకి వస్తే దాని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.
టీ కాంగ్రెస్‌లో ఐక్యత కోసం..
మరోవైపు టీకాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువ. కర్ణాటకలోనూ అంతే. కానీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో అంతా ఐక్యంగా పనిచేశారు. తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో పనిచేయడానికి కూడా రాహుల్ పర్యటన దోహద పడుతుందని నేతలు అంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ అన్ని సర్వేల్లో మెజారిటీకి కాస్త దూరంలో ఆగిసోతోంది. 50 నుంచి 55 మధ్య సీట్లు వస్తున్నట్లు కాంగ్రెస్ సర్వే కూడా తేల్చింది. దీంతో ఇంకాస్త ఎక్కువ కష్టపడితే మ్యాజిక్ ఫికర్ రీచ్ కావొచ్చన్న అభిప్రాయం టీకాంగ్రెస్‌లో ఉంది. ఇదే విషయాన్ని టీపీసీసీ రాహుల్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన కూడా తెలంగాణపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తన క్యాంపెన్ ద్వారా 5 నుంచి 10 సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. దీంతో మిగతా రాష్ట్రాల కన్నా… తెలంగాణపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
50 స్థానాలుపై దృష్టి..
దక్షిణాది నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది. అందుకోసమే రాహుల్ రాజస్థాన్ కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలు తెలంగాణలో రాహుల్ ప్రచారం చేశారు. ఎన్నికల నాటికి మరో నాలుగైదు సార్లు రాహుల్‌ను తెలంగాణకు రప్పించాలని టీకాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. టీపీసీసీ నేతలు అడిగిన వెంటనే రాహుల్ కూడా కాదనకుండా ప్రచారానికి వస్తున్నారు.
మొత్తంగా కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికలకన్నా… వచ్చే లోక్‌సభ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. అందులో భాగంగానే ముందు అసెంబ్లీని గెలిస్తే తర్వాత పార్లమెంటును గెలవడం పెద్ద కష్టం కాదని హస్తం పార్టీ ఆలోచన. మరి ఈ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
