Elon Musk: ఎలాన్ మస్క్ కంపెనీలకు X అనే పేరు ఎందుకు పెడుతున్నాడు? ఈ మార్పులు దేని కోసం?

2006 మార్చి 21న అమెరికాలోని కాలిఫోర్నియాలో నలుగురు వ్యాపారవేత్తలు కలిసి ‘ట్విట్టర్’ ను స్టార్ట్ చేశారు. కేవలం ఎస్ఎంఎస్ ను పంపించుకోవడానికి దీనిన ఏర్పాటు చేయగా రాను రాను వరల్డ్ లెవల్లో ఫేమస్ అయింది.

  • Written By: Chai Muchhata
  • Published On:
Elon Musk: ఎలాన్ మస్క్ కంపెనీలకు X అనే పేరు ఎందుకు పెడుతున్నాడు? ఈ మార్పులు దేని కోసం?

Elon Musk: ప్రపంచంలోని వ్యక్తులను కలిపే సోషల్ మీడియాను మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నారు. సమాచారంతో పాటు పలు ఫైళ్లను పంపించుకునేలా ఇవి పనిచేస్తున్నాయి. వీటిలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది ట్విట్టర్. ట్విట్టర్ పేరు చెప్పగానే బ్లూ కలర్ లో చిన్న పిట్ట గుర్తుకొస్తుంది. చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వరల్డ్ లెవల్లోకి దీని ద్వారా పంపించవచ్చు. అయితే ఇటీవల ట్విట్టర్ రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే. బుల్లిపిట్ట స్థాయంలో బ్లాక్ కలర్ X వచ్చింది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేస్తున్న మార్పుల్లో భాగంగా తనకిష్టమైన X ను చేర్చారు. X అనే పదాన్ని మనమైతే వ్యతిరేకానికి వాడుతాం. కానీ ఎలాన్ మస్క్ కు మాత్రం X అంటే చాలా ఇష్టమట. తన కంపెనీల్లో ప్రముఖమైనవి X తోనే ఉన్నాయి. మరి X అంటే ఆయనకు ఎందుకు ఇష్టం? ట్విట్టర్ కు X పెట్టడానికి కారణమేంటి?

2006 మార్చి 21న అమెరికాలోని కాలిఫోర్నియాలో నలుగురు వ్యాపారవేత్తలు కలిసి ‘ట్విట్టర్’ ను స్టార్ట్ చేశారు. కేవలం ఎస్ఎంఎస్ ను పంపించుకోవడానికి దీనిన ఏర్పాటు చేయగా రాను రాను వరల్డ్ లెవల్లో ఫేమస్ అయింది. సులభతరంగా లాగిన్ కావడంతో పాటు ఈజీగా మెసేజ్ ఫార్వడ్ చేయడానికి అవకాశం ఇవ్వడంతో దేశాధినేతలు సైతం దీనిని యూజ్ చేశాయి. అయితే కొన్ని నెలల కిందటే భారత్ ట్విట్టర్ నుంచి తప్పుకుంది. 2006లో దీనికి పిట్ట బొమ్మను లోగోగా డిసైట్ చేసి సెట్ చేశారు. ఆ తరువాత ఈ లోగో 2010 లో ట్రేడ్ మార్క్ పొందింది. 2012లో అధికారికంగా పిట్ట బొమ్మ లోగోనే వాడుతూ వస్తున్నారు.

దాదాపు 16 ఏళ్లలో ట్విట్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన వాళ్లు చేసిన మార్పులు తక్కువే. కానీ దీనిని స్వాధీనం చేసుకున్న మాస్క్ కేవలం 6 నెలల్లో అనేక మార్పులు చేస్తూ వస్తున్నాడు. ట్విట్టర్ సీఈవో నుంచి చిన్న ఉద్యోగుల వరకు మారుస్తూ వస్తున్నాడు. అలాగే ట్విట్టర్ యాప్ లోనూ అనేక మార్పులు తెస్తూ కఠినమైన నిబంధనలు తెస్తున్నాడు. దీంతో చాలా మంది ట్విట్టర్ యాప్ ను వాడేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ లోగోకు X అనే లెటర్ ను జోడించారు. చాలా మంది మస్క్ X అనే పదం ఎందుకు పెట్టారు? అనే సందేహంతో ఉన్నారు.

వ్యాపారం రాణించాలంటే భిన్నంగా ఆలోచించాలి. కానీ ప్రతీది భిన్నంగా ఆలోచించడం మస్క్ కు అలవాటు. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి X అనే లెటర్ కలిసొస్తుందట. 1999లోనే ఆయ X.com పేరిట ఆన్ లైన్ బ్యాంకుకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఆ తరువాత అది ‘పే పాల్ ’గా మారింది. ఆయనకున్న అంతరిక్షసంస్థ ‘స్పేస్ ఎక్స్’. ఆయన కుమారుడి పేరు కూడా ఎక్స్. అయితే ఎంత వ్యాపారవేత్త అయినా కొన్ని నమ్మకాలు పట్టించుకుంటారు. అలాగే మస్క్ కూడాX అనే పదం కలిసొస్తుందని అన్నింటికీX పెడుతూ వస్తున్నాడట.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు