India- Football: మన దేశంలోని ఒక రాష్ట్రం అంత కూడా జనాభా లేని సౌదీ అరేబియా ఏకంగా ఎన్నో సార్లు ఫుట్ బాల్ చాంపియన్ అయిన నంబర్ 1 జట్టు అర్జెంటీనాను ఓడించి షాకిచ్చింది. ఏకంగా ఆ దేశంలో సెలవు కూడా ఇచ్చేసిన పరిస్థితి. సౌదీ లాంటి చిన్న జనాభా దేశంతో పోలిస్తే భారత్ జనాభా ఏకంగా 40 రెట్లు ఎక్కువ. 140 కోట్ల భారతంలో దేశం తరుఫున ఫుట్ బాల్ ఆడే కనీసం 15 మంది లేరంటే దారుణం అని చెప్పొచ్చు.

India- Football
ఇప్పటికే దేశంలో ఫుట్ బాల్ లీగ్ అంటూ పెట్టి నగరాలను బేస్ చేసుకొని ఆడుతున్నారు. అయినా కూడా ప్రపంచ ఫుట్ బాల్ కప్ లో క్వాలిఫై కాలేని దుస్థితిలో టీమిండియా ఉంది. సౌదీ అరేబియాలాంటి లక్షల జనాభా ఉన్న దేశం ఫుట్ బాల్ లో అదరగొడుతుంటే కనీసం మన జీవితకాలంలో సౌదీలతో సరితూగగలిగే ఒక ఫుట్ బాల్ జట్టు కాగలిగే 15 మంది ఆటగాళ్లు ఇండియాకు దొరక్కపోవడమే మన క్రీడా వైఫల్యంగా చెప్పొచ్చు.
ఇందులో విడ్డూరం ఏమీ లేదు. ఇదొక వాస్తవం. కొన్ని కులాలే కత్తి పట్టాలి, రాజ్యం చేయాలని అనుకున్నాం, కాబట్టి అందరూ ఈ జాతి మీద దండెత్తి ఓడించారు.
కొన్ని కులాలే వ్యాపారం చేయాలి అనుకున్నాం కాబట్టి బ్రిటిష్, పోర్చుగీసులు వ్యాపారానికి వచ్చి ఏకంగా రాజ్యం ఆక్రమించుకున్నారు.
కొన్ని కులాలే చదువుకోవాలి అనుకున్నాం కాబట్టి పురాణాలు, కథలు రాసుకుంటూ అన్ని దేశాలూ కనిపెట్టిన వస్తువులు వాడుకుని బ్రతుకుతున్నాం.

India- Football
ఇక్కడ తెలివి, ప్రతిభ, నైపుణ్యం, సంస్కారం, గౌరవం, మట్టి, మశానం అన్నీ ఆ కొన్నికులాల వద్దే వుంటుంది. మిగతా 90శాతం జనాభా కులాల జనం గొర్రెల్లా, బర్రెల్లా వాళ్లు చెప్పినదానికి తలకాయ వూపుతూ బ్రతికేస్తూంటారు.
క్రికెట్ లోనూ అంతే బాగా ఆడే సంజూ శాంసన్ ను పెవిలియన్ లో కూర్చోబెట్టి వరుసగా విఫలమవుతున్న కీపర్ రిషబ్ పంత్ ను వరుసగా ఆడిస్తున్నారు. ఎందుకంటే అతడు గుజరాతీ.. బీసీసీఐని ఏలుతున్నది గుజరాతీ అయిన అమిత్ షా కొడుకు జైషా. అందుకే క్రికెట్ లోనూ అర్హులకు అన్యాయమై ప్రపంచకప్ లు గెలవాల్సిన జట్టు చతికిలపడుతోంది. సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకుండా లాబీయింగ్ తో ఆటగాళ్లు ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి.