Rajamouli: తనతో పని చేసిన ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే రాజమౌళికి ఎందుకు ఇష్టం?

రాజమౌళికి నచ్చిన మరొక హీరోయిన్ సలోని అట. మర్యాద రామన్న మూవీలో సలోని హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో సలోని వర్క్ ఆయనకు నచ్చిందట.

  • Written By: SRK
  • Published On:
Rajamouli: తనతో పని చేసిన ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే రాజమౌళికి ఎందుకు ఇష్టం?

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి హీరోయిన్స్ ని రిపీట్ చేయడు. ఒక్క అనుష్క విషయంలో మాత్రమే ఇది జరిగింది. అనుష్క కెరీర్లో విక్రమ్ మార్కుడు ఫస్ట్ హిట్. ఆ సినిమాతోనే ఆమెకు బ్రేక్ వచ్చింది. అరుంధతి ఆమెకు స్టార్డం తెచ్చింది. ఇక బాహుబలి సిరీస్ తో అనుష్క ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. రాజమౌళి అనుష్కతో అత్యధికంగా మూడు సినిమాలకు పని చేశాడు. బాహుబలి 2 విషయంలో ఆమె కొంచెం ఇబ్బంది పెట్టింది. బాహుబలి 1 విడుదలయ్యాక గ్యాప్ లో జీరో సైజ్ అనే చిత్రం చేసింది.

ఆ సినిమాలో ఆమె ఊబకాయంతో ఇబ్బందిపడే అమ్మాయి పాత్ర చేసింది. అందుకు నిజంగానే బరువు పెరిగింది. అయితే తగ్గడం అనుష్క వల్ల కాలేదు. బరువు పెరిగి షేప్ అవుట్ అయిన అనుష్కను దేవసేనగా చూపించలేకపోయారు రాజమౌళి. మరో ఆప్షన్ లేకపోవడంతో సీజీలో ఆమెను సన్నగా చూపించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అనుష్క అంటే తనకు చాలా ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు.

తాను హార్డ్ వర్క్ చేస్తుంది. సిన్సియర్ గా ఉంటుంది. అందుకే అనుష్క అంటే ఇష్టమని ఆయన చెప్పారు. రాజమౌళికి నచ్చిన మరొక హీరోయిన్ సలోని అట. మర్యాద రామన్న మూవీలో సలోని హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో సలోని వర్క్ ఆయనకు నచ్చిందట. సలోని కూడా వర్క్ పట్ల నిబద్ధతగా ఉంటుందట. సలోని మంచి నటి అని రాజమౌళి స్వయంగా పొగిడారు. చాలా మంది హీరోయిన్స్ తో పని చేసిన రాజమౌళికి మాత్రం అనుష్క, సలోని అంటే బాగా ఇష్టం అట.

ఒక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ప్రపంచ సినిమా దిగ్గజాలను మెప్పించిన రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్న రాజమౌళి త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు. మహేష్ మూవీకి హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని సమాచారం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు