Heroine Sreeleela : హీరోయిన్ శ్రీలీలకి ఆ హీరో అంటే ఎందుకు అంత పిచ్చి..?
Heroine Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ లాగా దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల.ఈమె రాకతో పాపం ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్ల కెరీర్స్ రిస్క్ లో పడిపోయాయి.యూత్ మొత్తం శ్రీలీల అంటే మెంటలెక్కిపోతున్నారు, ఆమె అందం, నటన మరియు డ్యాన్స్ ప్రతీ ఒక్కటి కూడా తెగ నచ్చేసింది మన కుర్రాళ్లకు.ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి.అందులో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి […]

Heroine Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ లాగా దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల.ఈమె రాకతో పాపం ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్ల కెరీర్స్ రిస్క్ లో పడిపోయాయి.యూత్ మొత్తం శ్రీలీల అంటే మెంటలెక్కిపోతున్నారు, ఆమె అందం, నటన మరియు డ్యాన్స్ ప్రతీ ఒక్కటి కూడా తెగ నచ్చేసింది మన కుర్రాళ్లకు.ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి.అందులో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి కాగా,నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మరొకటి.
ఇందులో ఈమె బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.ఇంకా టైటిల్ ఖారారు కానీ ఈ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీలీల ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతుంది.
చాలా కాలం నుండి శ్రీలీల ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అనేదానిపై సోషల్ మీడియా లో ఎవరికీ తోచిన కథనాలు వాళ్ళు రాసుకునేవారు.కానీ శ్రీలీల కి నిజంగా ఇష్టమైన హీరో ఎవరో ఈ ఇంటర్వ్యూ తో తేలిపోయింది.ఆమె మాట్లాడుతూ ‘నేను చిన్నప్పటి నుండి బాలయ్య బాబు కి వీరాభిమానిని,గత కొద్ది రోజుల క్రితం నుండే ఆయనతో కలిసి పని చేస్తున్నాను.ఈ కొద్ది రోజులలోనే ఆయన నుండి ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాను.ఆయన చేస్తున్న మంచి పనులు, సేవా కార్యక్రమాలు చూసి బాలయ్య ని ఒక మనిషిగా కూడా ఎంతగానో ఆరాధించడం ప్రారంభించాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.
ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇది ఇలా ఉండగా శ్రీలీల లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది అనే విషయం తెలిసిందే.అలా కుర్ర హీరోలు , సీనియర్ హీరోలు ,స్టార్ హీరోలు అందరికీ కూడా ఇప్పుడు శ్రీలీలనే కావాల్సి వచ్చింది.కేవలం రెండు సినిమాలతో ఈ రేంజ్ క్రేజ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా దక్కించుకోలేదు.
