#YSRCPAgain2024 : మళ్లీ జగన్ రావాలని జనం ఎందుకు కోరుకుంటున్నారు?
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, వైసీపీ క్యాడర్ సానుభూతిపరులు సోషల్ మీడియాలో #YSRCPAgain2024 ట్రెండింగ్ ప్రారంభించారు.

#YSRCPAgain2024 : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ కు జన నీరాజనం పలుకుతున్నారు. ##YSRCPAgain2024 పేరుతో హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే దాన్ని ట్విట్టర్ లో టాప్ 1 ట్రెండింగ్ లోకి తీసుకెళ్లారు. జగన్ రావాలి.. మళ్లీ 2024లో జగన్ గెలవాలంటూ ట్వీట్లు చేస్తూ వైసీపీ పాలనకు ఆమోదముద్ర వేస్తున్నారు.
జాతీయ స్థాయిలో ఇప్పుడు #YSRCPAgain2024 అనే హ్యాష్ ట్యాగ్ నంబర్ 1గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, రాజకీయంగా సాధించిన విజయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, నెటిజన్లు జగన్ కు మద్దతుగా ఈ హ్యాష్ ట్యాగ్ ను దేశంలోనే నంబర్ 1గా పోస్ట్ చేస్తున్నారు. సీఎంగా జగన్ సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న ఆదరణ తదితర అంశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వైసీపీ సోషల్ సైన్యం పోస్ట్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, వైసీపీ క్యాడర్ సానుభూతిపరులు సోషల్ మీడియాలో #YSRCPAgain2024 ట్రెండింగ్ ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా, ట్రెండింగ్‌ను ప్రారంభించిన 10 నిమిషాలలోపు ఇది దేశంలోనే మొదటి స్థానంలో రావడం విశేషం. అంటే వైసీపీ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ క్యాడర్ గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు మరియు మైలురాళ్లకు సంబంధించిన ట్వీట్లతో పాటు తమ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ గురించి మరింత సమాచారంతో పోస్ట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుగుదలను పేర్కొంటున్నారు.
ఈ ట్వీట్‌లకు దేశవ్యాప్తంగా నెటిజన్ల నుండి ఎక్కువ వీక్షణలు వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, వైసీపీ సోషల్ మీడియా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పార్టీ గురించి సామాజిక ప్రచారాలను రూపొందించడంలో ప్రో-యాక్టివ్‌గా మారింది. మళ్లీ ఇంత యాక్టివ్ గా ఎప్పుడూ మారలేదని అంటున్నారు.
గత ఏడాది జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో వారి ట్రెండింగ్‌లకు మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకుంది.
వైసీపీ సంక్షేమ పథకాలు, పాలన పట్ల నెటిజన్లు , సామాన్య ప్రజల నుండి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి రెండవ సారి అధికారం తెచ్చిపెట్టే విధంగా మారుతోంది.
వైఎస్ఆర్ చేసిన మంచి పనులకు ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారు ఉన్నారు. అంతకుమించిన సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన జగన్ ను ఇప్పుడు ప్రజలు అంతే ఆదరిస్తున్నారు.ఇప్పుడు నెటిజన్లు అంతా ‘మళ్లీ జగన్ రావాలి’ అంటూ #YSRCP Again 2024 అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.