Dogs Crying: రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి
అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి. వాటికి ఏం కనబడుతుంది. వాటికి ఆత్మలు కనిపిస్తాయట. అందుకే వాటిని చూసి ఏడుస్తాయట. దీంతో మనకు మాత్రం భలే భయం కలుగుతుంది.

Dogs Crying: మనది ఆధ్యాత్మికత దేశం. అన్నింటికి పట్టింపులే ఉంటాయి. కుక్క ఏడ్చినా, పిల్లి అరిచినా అశుభంగానే భావిస్తుంటారు. అర్దరాత్రి సమయంలో వాటి ఏడుపులు అంత మంచివి కావంటారు. కానీ అవి మాత్రం ఏడుపు మొదలు పెట్టాయంటే ఆపవు. అలాగే ఏడుస్తుంటాయి. దీంతో మనకు భయం కలుగుతుంది. చిన్న పిల్లలైతే ఎంతో వణికిపోతుంటారు. ఇలా రాత్రుళ్లు కుక్కల ఏడుపు మంచిది కాదు.
అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి. వాటికి ఏం కనబడుతుంది. వాటికి ఆత్మలు కనిపిస్తాయట. అందుకే వాటిని చూసి ఏడుస్తాయట. దీంతో మనకు మాత్రం భలే భయం కలుగుతుంది. కుక్క ఏడుస్తుందంటే చాలు నిద్రలో కూడా మెలకువ వస్తుంది. రాత్రుళ్లు నక్కలు కూడా అరుస్తుంటాయి. ఇవన్ని అశుభాలకు సంకేతాలే. దీంతో కుక్క, నక్క, పిల్లి అరిచినా అవి మనకు ప్రతికూల ప్రభావాలే కలిగిస్తాయి.
రాత్రుళ్లు గజ్జల శబ్ధం వస్తే మాత్రం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు లెక్క. ఆ సమయంలో మనం భయపడాల్సిన పనిలేదు. ఆమెనే తలుచుకుంటే పడుకుంటే మంచిది. ఇంకా రాత్రి వేణుగానం వినిపించినా దేవుడి మహిమే అంటారు. మనకు ఎన్నో రకాల సంకేతాలు వాటి ప్రభావాలను చూపిస్తాయి. ఈ నేపథ్యంలో రాత్రుళ్లు భయం గొలిపేలా కుక్కల ఏడుపు ఉంటుంది.
మన ఇంట్లో నుంచి వచ్చే శబ్ధాలకు భయపడాల్సిన పనిలేదు. కానీ కుక్కల ఏడుపు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేస్తుంది. కుక్కలు ఏడ్చాయంటే ఊళ్లో ఎవరో ఒకరు చనిపోవడం ఖాయమని నమ్ముతారు. ఇలా మన హైందవ ధర్మంలో ఇలాంటి నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పాటించడం మనకు ఓ అలవాటుగానే మారింది.