Ninne Pelladata: నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ లో ఆ విషయాన్ని నాగార్జున కి ఎందుకు చెప్పలేదంటే..?

ఇక ఈ సినిమా అప్పట్లోనే ఆ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటించింది. ఆమె అప్పటికే నాగార్జునతో సిసింద్రీ సినిమాలో కూడా ఒక పాటలో నటించింది.

  • Written By: Shiva
  • Published On:
Ninne Pelladata: నిన్నే పెళ్లాడుతా మూవీ  క్లైమాక్స్ లో ఆ విషయాన్ని నాగార్జున కి ఎందుకు చెప్పలేదంటే..?

Ninne Pelladata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలలో నాగార్జున ఒకరు అప్పట్లో ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగానే ఈయన కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఒకటి… ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.ఈ సినిమాలో నాగార్జున నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇక ఈ సినిమాలో కృష్ణవంశీ మేకింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. అప్పటివరకు నాగార్జున అంటే ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది, కానీ ఆ సినిమాతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా దగ్గర అయ్యాడు. ఈ సినిమా ఒక ఫ్యామిలీ లో జరిగే స్టోరీ కాబట్టి ఒక ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఇబ్బంది లేకుండా ఈ సినిమాని చూడవచ్చు.

ఇక ఈ సినిమా అప్పట్లోనే ఆ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటించింది. ఆమె అప్పటికే నాగార్జునతో సిసింద్రీ సినిమాలో కూడా ఒక పాటలో నటించింది. అయితే టబు ఈ సినిమా క్లైమాక్స్ లో విషం తాగుతుంది దాంతో ఆమె నాగార్జున ని కలిసిన వెంటనే నోట్లో నుంచి బ్లడ్ అనేది వాంతింగ్ చేసుకుంటుంది అయితే ఆ సీన్ గురించి డైరెక్టర్ నాగార్జున కి ముందుగా చెప్పలేదంట.దాంతో జస్ట్ టబు వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుంటుంది అని మాత్రమే కృష్ణవంశీ చెప్పాడట షాట్ చేయడానికి రెడీ అయిన తర్వాత యాక్షన్ చెప్పిన వెంటనే తను వచ్చి నాగార్జునని హగ్ చేసుకుంటుంది. దాంతో ఆమె ఒక్కసారిగా బ్లడ్ వాంతింగ్ చేసుకుంటుంది.అది చూసిన నాగార్జున తను నిజంగానే వాంతింగ్ చేసుకుందేమో అని చాలా కంగారు పడిపోయి ఆ ఒక్క నిమిషం గట్టిగా అరిచారట దాంతో షూటింగ్ ఆఫ్ చేశారంట… అప్పుడు కృష్ణవంశీ వచ్చి ఈ ముందు సీన్ లో అమ్మాయి విషం తాగుతుంది సార్ అని చెప్పాడట.అయితే క్లైమాక్స్ ఇంతకు ముందు వేరేలా ఉండేది కదా అంటే అంతకు ముందు వేరేలా ఉండేది కానీ లొకేషన్ లోనే ఆ సీన్ మార్చినట్టుగా చెప్పాడట కృష్ణవంశీ. అప్పుడు నాగార్జున కొంచెం కోపానికి వచ్చి ముందే ఆ సీన్ గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని కృష్ణవంశీ ని అడిగాడంట దాంతో ఆయన ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి ఆ అమ్మాయి విషం తాగిందనే విషయం తెలియదు కదా అందుకోసమని సీన్ నాచురల్ గా రావడానికి మీకు ఆ అమ్మాయి విషం తగ్గిన విషయం ముందుగా చెప్పలేదు అని చెప్పాడట… దానికి నాగార్జున అవాక్కై ఆ షాట్ ఎలా వచ్చిందో మానిటర్ దగ్గరికి వెళ్లి చూసుకున్న తర్వాత అందరూ బాగా వచ్చింది అని అనగానే నాగార్జున మరో సారి బాగా చూసుకొని పర్లేదు నాచురల్ గా చేశాను అని తనకు తానే అనుకుని కృష్ణవంశీ ని పొగుడుతూ తనలో తాను నవ్వుకున్నాడట…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు