YS Sharmila : ఆటలో అరటిపండు అయిన షర్మిల.. తెలంగాణ ఎన్నికల నుంచి ఎందుకు వైదొలిగింది?

. అయితే షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

  • Written By: NARESH
  • Published On:
YS Sharmila : ఆటలో అరటిపండు అయిన షర్మిల.. తెలంగాణ ఎన్నికల నుంచి ఎందుకు వైదొలిగింది?

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైయస్ షర్మిల తండ్రి పేరిట పార్టీ పెట్టారు. ఊరూ వాడా పాదయాత్ర చేశారు. నేను మీ తెలంగాణ బిడ్డ నేనని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు ఆ స్థాయిలో ఆమెను తమ ఆడపడుచుగా చూడలేకపోయారు.దీంతో ఇక లాభం లేదనుకున్న ఆమె తన తండ్రి పార్టీ అయినా కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రయత్నించారు. అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసినా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సొంతంగా పోటీ చేయాలని భావించారు. కానీ అభ్యర్థులు దొరకలేదో.. లేకుంటే ధైర్యం చాలలేదో కానీ ఉన్నఫలంగా అస్త్ర సన్యాసం చేశారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. ఓట్లు చీలిపోనివ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు.

సోదరుడు జగన్ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అధికారంలోకి రాగలిగారు. తెలంగాణలో తాను సైతం తండ్రి పేరిట వైయస్సార్ టిపి పార్టీని ఏర్పాటు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని షర్మిళ నిర్ణయించుకున్నారు. భారీ అంచనాలతో తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే జగనన్న వదిలిన బాణమా? కెసిఆర్ కు లబ్ధి చేకూర్చే ఆయుధమా? లేకుంటే బిజెపికి బీటిమా? అన్నట్టు షర్మిల రాజకీయ ప్రయాణం కొనసాగింది. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా సాగరం లాంటి కాంగ్రెస్ వైపు ఆమె ప్రయాణం కొనసాగుతుండడం విశేషం.

మొన్న ఆ మధ్యన కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి ఢిల్లీలో ఉన్న అగ్రనేతలతో షర్మిల సమావేశం అయ్యారు. ఇదిగో విలీన ప్రకటన.. అదిగో విలీన ప్రకటన అంటూ హడావుడి నడిచింది. సీట్ల దగ్గర మడత పేచి వచ్చినట్లు ప్రచారం జరిగింది. తాను పోటీ చేయడానికి ఖమ్మం జిల్లా పాలేరు సీటుతో పాటు మరికొన్ని సీట్లను షర్మిల డిమాండ్ చేసినట్లు టాక్ నడిచింది. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఆమెకు ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ నచ్చక రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయడానికి షర్మిల సిద్ధపడ్డారు. కానీ అందుకు తగ్గట్టు అనుకూల పరిస్థితులు లేవీ కనిపించలేదు. అందుకే ఆమె కాంగ్రెస్కు బే షరతుగా మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకున్నారు.

వైయస్సార్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయకుండానే.. నేరుగా షర్మిల మద్దతు ప్రకటించడం విశేషం. తెర వెనుక ఏం జరిగి ఉంటుందన్న అనుమానం కలుగుతోంది. షర్మిల ను ఏపీ రాజకీయాల కోసం వినియోగించుకుంటారా అన్న టాక్ ప్రారంభమైంది. సీఎం జగన్ పైనే ఆమె సోదరిని ప్రయోగిస్తారు అన్న ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ఇప్పుడు షర్మిల సైతం కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంది. అయితే ఇదంతా కాంగ్రెస్కు సానుకూల ఫలితం చూపిస్తుందన్న టాక్ ప్రారంభమైంది. అయితే షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు