Ram Charan – Upasana : రామ్ చరణ్ దంపతులు బొడ్డుతాడును ఎందుకు దాచారు? దీని వల్ల ఉపయోగం ఏంటి?
తాజాగా ఉపాసన తన పాప గురించి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన పాపకు సంబంధించిన బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థలో భద్రపరుస్తున్నట్లు తెలిపింది.

Ram Charan – Upasana : సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతి ఒక్క సెలబ్రెటీ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె గర్భం దాల్చిన నుంచి ప్రతీ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పారు. గత జూన్ లో రామ్ చరణ్ దంపతులకు ఆడబిడ్డ్ జన్మించిన విషయం తెలిసిందే. ఈమె బారసాలను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. తాజాగా ఉపాసన తన పాప గురించి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన పాపకు సంబంధించిన బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థలో భద్రపరుస్తున్నట్లు తెలిపింది. గతంలో హీరోయిన్స్ కాజోల్, శిల్పాశెట్టిలు సైతం ఇదే విధంగా తమ పాపల బొడ్డు రక్తాన్ని ఇలా భద్రపరిచారు. అసలు బొడ్డు తాడు అంటే ఏమిటి? దానిని ఎందుకు భద్రపరుస్తున్నారు?
గర్భస్త శిశువు కడుపులో ఉండగా తనకు ఆక్సిజన్, గ్లూకోజ్ లాంటివి ఈ బొడ్డు తాడు ద్వారానే అందుతాయి. బొడ్డు తాడులో రెండు రక్తనాళాలు ఉ:టాయి. వీటిలో ఒకటి రక్తనాళం నుంచి యూరియా, కార్బన్ డై యాక్సైడ్ లను తల్లి రక్తనాళాలకు వదిలేస్తుుంది. మరో నాళం నుంచి ఆక్సిజన్, ఇతర పోషకాలు అందుతాయి. అయితే బిడ్డ జన్మించినప్పటికీ బొడ్డుతాడు అలాగే ఉంటుంది. ఆపరేషన్ చేసినప్పుడు బొడ్డు తాడు ప్లసెంటాకు అనుసంధానమై ఉంటుంది. బిడ్డ జన్మించిన తరువాత వైద్యులు దీనిని కట్ చేసిన ముడివేస్తారు. దీనినే అంబిలికల్ కార్డు క్లిప్పింగ్ అని అంటారు. ఇలా కట్ చేసిన బొడ్డు తాడు 15 రోజుల్లో నల్లబడి ఆటోమేటిక్ గా ఊడిపోతుంది.
బొడ్డుతాడును ఒకప్పుడు వ్యర్థంగా పరిగణించేవారు. కానీ దీనిపై కొందరు వైద్యులు పరిశోధనలు చేసిన తరువాత వీటిలో హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయని గుర్తించారు. కొన్ని రకాల వ్యాధుల చికిత్సలో వీటిని ఉపయోగించేందుకు అవకాశం ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ పేర్కొంది. తలసేమియా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారని పేర్కొంది. అయితే ఇలాంటి స్టెమ్ సెల్స్ ఎముకల్లో కూడా కనిపిస్తాయి.
అయితే భవిష్యత్ లో బిడ్డకు ఎటువంటి చికిత్స అవసరమైనప్పుడు దీనిని ఉపయోగిస్తారు. అందువల్ల దీనిని ప్రత్యేకంగా భద్రపరుస్తారు. అయితే బొడ్డుతాడును భద్రపరిచేందుకు మనం ఎంచుకున్న సమయాన్ని భట్టి ధరను నిర్ణయిస్తారు. ఉదాహరణకు స్టెమ్ సైట్ సంస్థ 25 ఏళ్ల పాటు దీనిని భద్రపరిస్తే రూ.55 వేలు తీసుకుంటుంది. అదే 75 ఏళ్లకు రూ.70 వేలు వసూలు చేస్తుంది. దీనికి అదనంగా చికిత్స కోసం ఇన్సూరెన్స్ ను కూడా తీసుకోవచ్చు.
