NTR- SS Rajamouli: ఎన్టీఆర్ ను హీరోగా రాజమౌళి ఎందుకు ఇష్టపడలేదు ?
NTR- SS Rajamouli: జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచాడు. పైగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే రాజమౌళి ఎన్టీఆర్ తో మంచి సినిమాలు చేశాడు. మొదటి నుంచి ఎన్టీఆర్ సినిమాల్లో బాగా హైలైట్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తూ వచ్చాడు. కానీ.. మీకు తెలుసా ? ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి మొదట్లో అసలు ఇష్టపడలేదు. రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ తోనే. […]

NTR- SS Rajamouli: జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచాడు. పైగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే రాజమౌళి ఎన్టీఆర్ తో మంచి సినిమాలు చేశాడు. మొదటి నుంచి ఎన్టీఆర్ సినిమాల్లో బాగా హైలైట్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తూ వచ్చాడు. కానీ.. మీకు తెలుసా ? ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి మొదట్లో అసలు ఇష్టపడలేదు.

NTR- SS Rajamouli
రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ తోనే. ఎన్టీఆర్ తో ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీశాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దగ్గర పలు సీరియల్స్ కు రాజమౌళి సహాయ దర్శకుడిగా పని చేస్తున్న రోజులు అవి. రాజమౌళి దర్శకుడిగా మారాలని ఆశ పడుతున్నాడు. కుర్రాడు మంచి పనిమంతుడు. అందుకే.. రాఘవేంద్రరావు తన దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు.
Also Read: Krishna Vamsi Khadgam Movie: ఆ దర్శకుడితో సంగీత బెడ్ రూమ్ సీన్.. కృష్ణవంశీ టార్గెట్ అదేనా ?
అలా పరిచయం చేస్తూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నిర్మించాలని సిద్ధం అయ్యారు. తనకు దర్శకత్వం ఛాన్స్ రావడంతో రాజమౌళి చాలా సంతోషపడ్డారు. కానీ, హీరో ఎన్టీఆర్ అని తెలిసింది. ఎన్టీఆర్ ఫోటోలు చూసి ఒక్కసారిగా రాజమౌళికి నీరసం వచ్చింది. షూటింగ్ కు ముందు ఎన్టీఆర్ ను కలిశాడు రాజమౌళి. ఎన్టీఆర్ అల్లరి చూశాక ఇంకా టెన్షన్ మొదలైంది. తనకు రాక రాక దర్శకత్వం ఛాన్స్ వస్తే.. ఇదేమిటి ?

NTR- SS Rajamouli
తన మొదటి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడు ఏమిటి ? అంటూ రాజమౌళి ఫీల్ అవుతూ కూర్చున్నాడు. దీనికి తోడు ఎన్టీఆర్ స్టిల్స్ చూసిన తర్వాత రాజమౌళికి ఇంకా భయం పట్టుకుంది. ఎన్టీఆర్ బొద్దుగా, లావుగా ఉండటంతో తన సినిమాకు ఎంత వరకు సూట్ అవుతాడు అనేది జక్కన్న అసలు భయం. ఆ భయంతోనే షూట్ స్టార్ట్ చేశాడు.

NTR- SS Rajamouli
సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అప్పటికే ఐదు రోజులు అయ్యింది. సీన్లు ఎడిటి చేసి రాజమౌళి చూసుకున్నాడు. ఎన్టీఆర్లో అమోఘమైన నటుడు ఉన్నాడు అని రాజమౌళికి అర్ధం అయ్యింది. అప్పుడే రాజమౌళి ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ గా వాడుకుంటే.. ఎన్టీఆర్ సూపర్ స్టార్ అవుతాడు అని జక్కన్న గుర్తించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అన్న పేరు ముద్ర పడిపోయింది.
Also Read:Nagarjuna: ఆయన వల్లే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టారట.. సంచలన నిజాలు!
Recommended Videos:
