Venu- Raasi: వేణు ని జగపతిబాబు ఎందుకు మోసం చేశాడు..?రాశి కి వేణుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గా మంచి పేరు సంపాదించుకున్న వాళ్లలో వేణు ఒకరు. ఈయన చాలా సినిమాల్లో చేసి ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.

  • Written By: Gopi
  • Published On:
Venu- Raasi: వేణు ని జగపతిబాబు ఎందుకు మోసం చేశాడు..?రాశి కి వేణుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

Venu- Raasi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు అగ్ర హీరోలుగా వెలుగొందాలని చెప్పి ఇండస్ట్రీకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్యూర్ అయిపోతు ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఆయన్ని ఎవరు ఆపలేరు అనేది మాత్రం చాలాసార్లు చాలామంది ప్రూవ్ చేశారు. ఇక అలాంటి టైం లో ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది కొత్త నటులు కూడా మంచి హిట్లు కొట్టి వాళ్ల కంటు ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తూ నటుడిగా తనదైన కీర్తి ప్రతిష్టలను అందుకోవాలని చాలామంది నటులు ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందరికీ ఒకే రకమైన అవకాశాలు అయితే దక్కవు ఇండస్ట్రీలో ఏ అవకాశం ఎవరి రూపంలో వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు అదొక మిరాకిల్ అంతే అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది జనాలు నిలకడలేని ఒక ప్రొఫెషన్ గా అభివర్ణిస్తారు.

ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గా మంచి పేరు సంపాదించుకున్న వాళ్లలో వేణు ఒకరు. ఈయన చాలా సినిమాల్లో చేసి ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. మొదటగా ఈయన స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీలో మొదటి సక్సెస్ ని అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో గా ఎదిగారు అలా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఇక స్వయంవరం సినిమాకి కథ, మాటలు ఇచ్చిన త్రివిక్రమ్ గారితోనే మరో సినిమా అయిన చిరున్నవుతో సినిమాకి కూడా కథ మాటలు రాయించుకొని ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యేలా చేసుకున్నాడు వేణు…ఇక దాంతో ఇండస్ట్రీలో వేణుకి తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ వల్ల ఆయన సినిమా కెరియర్ కొంత వరకు ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి.అందుకే ఆయన ఇండస్ట్రీ నుంచి దూరం కావలసి వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు.

అయితే వేణు మనసు పడ్డాను కానీ అనే ఒక సినిమా తీశారు అందులో హీరోయిన్ గా రాశి నటించారు. ఇక ఈ సినిమా టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం ఉందని చాలా న్యూస్ లు బయటకు వచ్చాయి.దాంతో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అందరూ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ వీళ్ళ మధ్య ఏదీ లేదు అనేది వాళ్ళిద్దరిలో ఎవరూ కూడా ఓపెన్ గా చెప్పలేకపోయారు దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చెప్పుకోలేని సంబంధం అయితే ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది. ఇక దాంతో ఆయన తర్వాత సినిమాలు చేసినప్పటికీ ఆయనకి పెద్దగా సక్సెస్ లు రాలేదు.అందుకే ఆయన ఇతర హీరోల సినిమాల్లో సెకండ్ హీరోగా నటిస్తూ కొన్ని సక్సెస్ లను కూడా అందుకున్నాడు. అందులో భాగంగానే ఆయన హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో నటించాడు, అలాగే ఖుషి ఖుషీగా,పెళ్ళాం ఊరేళ్లితే అనే సినిమాల్లో కూడా నటించారు.

ఈ రెండు సినిమాలు చేస్తున్నప్పుడు జగపతి బాబు గారు ఆయనకు మంచి స్నేహితుడు అయ్యాడు. దాంతో వీళ్లిద్దరూ తరచుగా కలుసుకుంటూ మాట్లాడుకునేవారు. అయితే ఒక్కరోజు జగపతిబాబు ఆయన ఫ్రెండ్ అయినా ఒక వ్యక్తిని వేణు దగ్గర కు తీసుకువచ్చి వేణు నుంచి 14 లక్షల రూపాయలని ఆ వ్యక్తి కి ఇప్పించారు. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకున్నవాడు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఏమీ లేదు దాంతో వేణు జగపతిబాబు గారి దగ్గరికి వెళ్లి ఇలా కాదు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్తే ఆయన దానికి నేనేం చేయను అని సింపుల్ గా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. దాంతో ఆయన 14 లక్షల వరకు డబ్బులను కోల్పోవలసి వచ్చింది.అప్పట్లో 14 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్…ఇక అప్పటినుంచి వేణు జగపతిబాబు గారితో కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు ఇలా చాలావరకు నష్టపోయాడు.

ఆ తర్వాత ఆయనకి కొన్ని అప్పులు ఉండడంతో సినిమాల్లో వచ్చే మనీ ద్వారా అప్పులు తీర్చలేను అని తెలుసుకున్న ఆయన బిజినెస్ లు చేసి అప్పులు మొత్తాన్ని తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేసినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడం తో ఆతనికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. అతిధి అనే ఒక ఓటిటి ఫిలింతో ఆయనకు మంచి గుర్తింపు అయితే వస్తుంది ఇక దాంతో లైఫ్ చాలా హ్యాపీగా సాగలని కోరుకుందాం…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు